ఇప్పటి వరకు ఆషాఢ మాసంతో పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. శ్రావణ మాసం మొదలైన నాటి నుండే భాజాలు, భజంత్రీలు మోగనున్నాయి. ఇక సెలబ్రిటీలు సైతం పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే స్టార్ నటీనటులు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే.
ఆషాఢ మాసం కావడంతో పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. శ్రావణ మాసం మొదలైన నాటి నుండే భాజాలు, భజంత్రీలు మోగనున్నాయి. ఇక సెలబ్రిటీలు సైతం పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే స్టార్ నటీనటులు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే. కేఎల్ రాహుల్-అతియా శెట్టి, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, స్వరా భాస్కర్-ఫహద్ అహ్మద్, ఆశిష్ విద్యార్థి, మధు మంతెనతో పాటు మన టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ శర్వానంద్.. రక్షితా రెడ్ది మెడలో జూన్‌లో మూడు ముళ్లు వేసిన సంగతి విదితమే. తాజాగా మరో యంగ్ హీరో బ్యాచులర్ లైఫ్‌కు స్వస్థి చెప్పబోతున్నాడు. అందుకు ఈ శ్రావణ మాసంలో ముహుర్తం ఫిక్స్ చేసుకున్నాడు.
అతడేవరో కాదూ తమిళ హీరో కవిన్. కవిన్ అంటే ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ ఇటీవల కాలంలో ఓటీటీలో వచ్చిన లిఫ్ట్, దాదా సినిమాలను చూసుంటే ఇట్టే గుర్తుపడతారు. దాదా సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ నటుడు.. పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆగస్టు 20న తన చిరకాల ప్రేయసి మోనికా డేవిడ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. తొలుత బుల్లితెరపై అలరించిన కవిన్.. ఇప్పుడు వెండితెరపై ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. కవిన్ తొలుత పలు సీరియల్స్‌లో నటించాడు. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు పిజ్జా సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగి.. ఆ తర్వాత హీరోగా మారాడు. 2019లో వచ్చిన నట్‌పున ఎన్నాను తెరియుమాతో తమిళ ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఈ ఏడాది వచ్చిన దాదా కవిన్‌కు బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడమే కాకుండా బిగ్గెస్ట్ కలెక్షన్లను రాబట్టింది. కేవలం రూ.4 కోట్లతో రూపొందిన ఈ మూవీ దాదాపు రూ.20 కోట్లు వసూలు చేసింది. ఓటీటీలో విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.. ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా, తమిళ బిగ్ బాస్ సీజన్ -3లో ఉండగా.. మరో కంటెస్టెంట్ లోస్లియాతో ప్రేమలో ఉన్నట్లు రూమర్లు వచ్చాయి. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి వార్తతో ఆ రూమర్లకు కూడా తెరపడినట్లు అయ్యింది.