ప్రమాదాలు ఎప్పుడు ఎలా సంబవిస్తుంటాయో తెలియదు. ఈ మద్య భారీ వర్షాల కారణంగా పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మణిపూర్ లో విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆర్మీ బేస్ క్యాంప్ పై ఒకేసారి కొండ చరియలు విరిగి పడటంతో ఏడుగురు ఆర్మీ జవాన్లు దుర్మరణం పొందారు. మరో 45 మంది సైనికులు గల్లంతయ్యారు. ప్రమాద స్థలం వద్ద భీతావాహం కనిపిస్తుంది. ప్రమాదం జరిగిందని తెలియగానే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ ఆపరేషన్ చేపడుతోంది. కొండ చరియల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసి వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు.
మణిపూర్ లో జరిగిన దుర్ఘటన గురించి ఆర్మీ అధికారి మాట్లాడుతూ.. ఇది చాలా విషాదకరమైన సంఘటన అని.. ఆర్మీ బైస్ పై ఒక్కసారే కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రమాదం చోటు చేసుకుందని.. ఇప్పటి వరకు 19 మందిని రక్షించాం. క్షతగాత్రులకు నోనే ఆర్మీ మెడికల్ యూనిట్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నామన్నారు. అలాగే శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.. మిగత గల్లంతైన వారి కోసం వెతుకుతున్నామని అన్నారు.
మణిపూర్ లో జరిగిన ఘటన పై ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మనసుకు ఎంతో బాధ కలిగిస్తుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరిస్థితులను సమీక్షించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గాలింపు, సహాయక చర్యల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపిన ముఖ్యమంత్రి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని, వైద్యులతో సహా అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
Manipur | Rescue operation underway after a massive landslide hit the company location of 107 Territorial Army of Indian Army deployed near Tupul railway station in Noney district. pic.twitter.com/sKzPCcWpyI
— ANI (@ANI) June 30, 2022
Noney | CM Manipur in constant touch for rescue operation. 19 people already rescued, being treated at Noney Army Medical unit. Evacuation of critically injured in progress. Bad weather&fresh landslides affecting Rescue operations: NF Railway CPRO
— ANI (@ANI) June 30, 2022
#WATCH | NDRF, SDRF, State Government and Railways workers involved in rescue work at the landslide-hit Tupul station building in Noney, Manipur
(Video credit: CPRO, NF Railway) pic.twitter.com/N7zo2pLaY7— ANI (@ANI) June 30, 2022