గత రెండేళ్లుగా దేశ వ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తుంది. కరోనా కారణంగా రెండు పర్యాయాలు లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ఇక లాక్ డౌన్ కారణంగా ప్రజలు మాత్రమే కాదు.. అడవుల్లో నివసించే జంతువులు సైతం కష్టాలు పడ్డాయి. కొన్ని క్రూర మృగాలు గ్రామాల్లో, పట్టణాల్లోకి ప్రవేశించి మేకలు, ఆవులు, కుక్కలను ఎత్తుకు వెళ్లిన సంఘటనలు చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే మనుషులపై కూడా అవి దాడులు చేశాయి.
క్రూర మృగాల్లో ఎక్కువగా చిరుత, ఎలుగు బంట్లు, పులు వచ్చి బీభత్సం సృష్టించాయి. వీటికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. తాజాగా అలీగఢ్‌లోని చర్రా ప్రాంతంలోని చౌదరి నిహాల్ సింగ్ ఇంటర్ కాలేజీలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. స్కూల్ క్యాంపస్‌లోకి చిరుతపులి ప్రవేశించి విద్యార్థిపై దాడి చేసింది. అతడి వీపుపై, చేయిపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే విద్యార్థిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
చిరుతపులి తరగతి గదిలో కలిగియ తిరగడం సీసీ ఫుటేజ్ లో కనిపించింది. వెంటనే కళాశాల యాజమాన్యాన్ని అప్రమత్తం అయి పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించింది. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు తొమ్మిది గంటల పాటు సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.