సామాన్యులు చిన్న పొరపాటు చేసిన కొందరు పోలీసులు అనేక రూల్స్ పేరుతో తెగ ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అయితే రూల్స్ అనేవి సామాన్యులకు ఒకలా అధికారులకు ఒకలా ఉండవని నిరూపించారు గుజరాత్ పోలీస్ అధికారులు. కారులో డ్యాన్స్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
ఇది కూడా చదవండి:
ప్రేమలో పడిన సురేఖ వాణి కూతురు సుప్రీత! పిక్స్ వైరల్!
గుజరాత్ లోని కచ్ జిల్లాలో గాంధీధామ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ కు చెందిన నలుగురు కానిస్టేబుళ్లు పాటలకు డ్యాన్స్ చేస్తూ కారును నడుపుతున్నారు. వీరిలో ఒకరు ఈ డ్యాన్స్ వీడియో తీసి సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఈ వీడియో చివరికి పోలీస్ ఉన్నతాధికారులకు చేరింది. పాటలు వింటూ కారు నడపడమే నేరం అయితే… కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో మాస్క్ కూడా ధరించలేదు. దీంతో ఉన్నతాధికారులు వీరిపై వెంటనే చర్య తీసుకున్నారు.
డ్యాన్స్ చేసిన కానిస్టేబుళ్లను కచ్ ఈస్ట్ ఎస్పీ మయూర్ పాటిల్ సస్పెండ్ చేశారు. సదరు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగించారని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. పోలీసు అధికారులు వారిని సస్పెండ్ చేసి మంచి పని చేశారని స్థానికులు అభినందించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా కారు ప్రయాణంలో సంగీతాన్ని ఆస్వాదిస్తున్న కానిస్టేబుళ్ల వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.