సాధారణంగా వాహనదారులు హెల్మెంట్ లేకున్నా, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, పొల్యూషన్ సర్టిఫికట్ వంటివి లేకుండా వాహనదారులు రోడ్లపై తిరుగుతుంటారు. దీంతో పోలీస్ శాఖ అలాంటి వారి భరతం పట్టేందుకు రోడ్లపై ఆపి చలానాను వసూలు చేస్తూ ఆదాయం సంపాదించుకుంటున్నారు. వాహనదారులు ఫైన్ చెల్లించినప్పటికీ పీడీఏ లేదా పీఓఎస్ మెషిన్లు గత జరిమానాలు పెండింగ్‌లో ఉన్నట్లు చూపిస్తున్నాయంటూ వాహనదారులు మోత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని వాహనదారులకు శుభవార్తను అందించారు ఆ రాష్ట్ర మంత్రి జ్ఞానేంద్ర.
నగరాల్లో ఎక్కడపడితే అక్కడ ఆపి చలాన్‌లు వసూలు చేస్తున్నారని తెలిపారు. దీంతో వాహనదారలు కాస్త ఇబ్బందులు ఎదురుకోవటంతో పాటు పీఓఎస్ మెషిన్లు గత జరిమానాలు పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వాహనదారులకు గుడ్ న్యూస్‌ను అందిస్తూ హోం మంత్రి ట్రాఫిక్ స్పాట్ ఫైన్‌ను రద్దుకు నిర్ణయం తీసుకున్నారు.
దీంతో వెంటనే ఈ ఆదేశాలను అమలు చేసేలా పోలీసు శాఖను ఆయన ఆదేశించారు. ఇక ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు వినియోగిస్తున్న చలానా ఉపకరణాలను వారి వారి పోలీస్‌స్టేషన్లలో అప్పగించాలని తెలిపారు. ఇక ఈ నిర్ణయంతో కర్ణాటక రాష్ట్రంలో వాహనదారులకు కాస్త తీపి కబురు అందినట్లైంది.