ఇటీవల కాలాంలో ముంబాయిలో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో అవిఘ్న పార్కులోని 64 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 19వ అంతస్తుల ఈ రోజు మధ్యాహ్న ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సుమారు 14 ఫైర్ ఇంజిన్లు, ఇతర సహాయక సిబ్బంది స్పాట్‌కు చేరుకుంది. ఈ అగ్ని ప్రమాదంతో ఓ వైపు ఎగిసిపడుతున్న అగ్నికీలలు.. మరో వైపు దట్టమైన పొగలు.. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఓ వ్యక్తి చేసిన సాహసం చివరికి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది.
ముంబైలో అవిఘ్న పార్కులోని శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. 19వ ఫ్లోర్‌లో మంటలు చెలరేగడంతో అరుణ్ తివారీ (30) అనే వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆ అంతస్తులోని బాల్కనీలోకి తివారీ వచ్చాడు. అక్కడ నుంచి కొద్ది సేపు గ్రిల్స్ పట్టుకొని వ్రేలాడుతూ క్రిందకు దిగేందుకు ప్రయత్నించాడు. అయితే పట్టు జారడంతో ఒక్కసారిగా పై నుంచి కిందకు పడిపోయాడు.
అరుణ్ తివారీకి తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. తాజాగా ఈ వ్యూజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, దక్షిణ ముంబైలోని అవిఘ్న పార్కులోని 64 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగినట్లు ఉదయం 11:55 గంటలకు తమకు సమాచారం అందిందని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చహల్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని బీఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్ ప్రమాద స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
#Mumbai: A 30-year old panicked man Arun Tiwari, who tried to save himself from the fire on the 19th floor of the 61-storeyed Avigna Park, fell to his death, #BMC Disaster Control said. pic.twitter.com/E4rPQszcvq
— Mohan Raut (@tweet_mohn) October 22, 2021
