ఇటీవల వరుసగా పలు కెమికల్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని పరిశ్రమలు మనుషులకు మృత్యు కేంద్రాలు గా మారాయంటే అతిశయోక్తి లేదు. సరైన సంరక్షణ చర్యలు తీసుకోకపోవడం.. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వెరసి పనికోసం వచ్చే ఎంతో మంది అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇటీవల కొన్ని కెమికల్ ఫ్యాక్టరీలు మృత్యుకేంద్రాలుగా మారి మనుషుల ప్రాణాలు నిలువునా తీసేస్తున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన పరిరక్షణ లేకపోవడం.. యాజమాన్యం నిర్లక్ష్యదోరణి వళ్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమల్లో జరిగే ఈ ప్రమాదాల కారణంగా తమ కుటుంబ పెద్దలను కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఓ ఆక్సిజన్ ప్లాంటులో పేలుడు సంభవించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ సమీపంలో కేశవ్ పూర్ వద్ద ఉన్న ఓ ఆక్సీజన్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్ధం రావడంతో చుట్టు పక్కల జనాలు ఉలిక్కి పడ్డారు. ఈ పేలుడు ధాటికి ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు వల్ల పెద్ద ఎత్తున మంటలు రావడంతో చుట్టు పక్కల మొత్తం దట్టంగా పొగలు అలుముకున్నాయి. అక్కడ వాతావరణం బీభత్సంగా మారిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది నానా తంటాలు పడ్డారు.
పేలుడులో గాయపడ్డ క్షతగాత్రులను దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. ఈ పేలుడు ధాటికి ఆక్సీజన్ ఫ్లాంట్ కు దాదాపు రెండు చదరపు కిలోమీటర్ల వరకు బిల్డింగ్ ప్రభావితం అయ్యిందని స్థానికులు చెబుతున్నారు. అక్కడ ఉన్న ఇనుప వస్తువులు.. ఇతర సామాగ్రి చెల్లా చెదురుగా పడిపోయాయని అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీలో పేలుడుకి గల కారణాలపై ఎంక్వేయిరీ చేస్తున్నట్లు తెలిపారు. ఇక శనివారం ఇండోనేషియా రాజధాని జకర్తాలో ప్రభుత్వ చమురు డిపోలో పెద్ద ఎత్తున పేలుడు సంభవించి 16 మంది దుర్మణం చెందారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల మంటలు వ్యాపించడంతో అధికారులు వేలాది మంది ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Locals said that the impact of the explosion at the oxygen plant was such that it shook buildings within a range of two square kilometers.
(@SahidulKhokonbd)#Bangladesh #News https://t.co/LjqCB8QhFt— IndiaToday (@IndiaToday) March 4, 2023