ఇటీవల హిమాలయా పరిసర ప్రాంతాల్లో పలుమార్లు భూకంపాలు తీవ్ర స్థాయిలో కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ తో పాటుగా ఇతర ప్రాంతాల్లో వరుస భూకంపాలు రావడంతో భయంతో ప్రజలు వణికిపోతున్నారు. గత ఏడాది దేశంలో పలుమార్లు భూకంపాలు సంబవించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదట హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంబవించింది. దీంతో ప్రజలు భయంతో వణికిపోయారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. కాకపోతే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అంటున్నారు.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ వెల్లడించింది. అలాగే ధర్మశాలకు 76 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగాల్లో సుమారు ఐదు కిలో మీటర్ల లోతులో ఈ ప్రకంపణలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఉత్తారాఖండ్ లో ఉత్తరకాశీలో ఒకరోజు ముందు అంటే శుక్రవారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో జోషీ మఠ్ లో స్వల్ప భూకంపం వచ్చింది.
దేశంలో పలు చోట్ల భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్లు పలుమార్లు కదలికలు సంబవించడం వల్లనే భూ ప్రకంపనలు వస్తున్నాని నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఏడాది జనవరి 1 న ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం వచ్చంది. ఆ తర్వాత బంగాళాఖాతం లో భూకంపం సంబవించింది. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంప తీవ్రత 4.5 గా నమోదు అయ్యింది. ఆ తర్వాత జనవరి 5న ఉత్తర భారతదేశంలో మరో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.5గా నమోదైంది. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Earthquake of Magnitude:3.2, Occurred on 14-01-2023, 05:17:15 IST, Lat: 32.25 & Long: 76.56, Depth: 5 Km ,Location: 22km E of Dharamshala, Himachal Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/fzTPRqgGor@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 pic.twitter.com/830j8jTum0
— National Center for Seismology (@NCS_Earthquake) January 14, 2023