ప్రభుత్వం అధికారులు అంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలి. కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుంటారు. దీంతో ప్రజలు తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అనే సంతోషం అధికారులు పెట్టే ఇబ్బందులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. అభివృద్ధి పనుల్లో భాగంగా ఓ ప్రాంతంలో రోడ్డు వేసేందుకు ఆ ప్రాంత మున్సిపల్ అధికారులు సిద్దమయ్యారు. అయితే అక్కడ పార్క్ చేసిన పై మీద నుంచి రోడ్డు వేసుకుంటూ వెళ్లారు. దీంతో ఆ వాహన యాజమాని అధికారులపై, కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులో వెల్లూర్ మున్సిపాలిటీలోని గాంధీ రోడ్ ప్రాంతం. మురుగన్ అనే వ్యక్తి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఆయన రోజూలాగే సాయంత్రం తన బైక్ ను ఇంటి ముందు పార్క్ చేశాడు. ఉదయం లేచి ఆఫీస్ కి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. బైక్ తాళాలు తీసుకుని బయటికి వచ్చాడు. కానీ ఇంటి ముందు బైక్ పరిస్థితి చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే.. రాత్రి ఆ గల్లీలో సీసీ రోడ్డు వేశారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ అలా ఉండగానే సిమెంట్ కాంక్రీట్ నింపేశారు. దానితో బైక్ ముందు, వెనక చక్రాలు, బైక్ స్టాండ్ ఆ సిమెంట్ రోడ్డులో చిక్కుకుపోయాయి. దీంతో మురగన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాత్రి 11 గంటల వరకు కూడా తాను ఇంట్లో నిద్ర పోకుండా ఉన్నానని.. కనీసం పిలవకుండానే బైక్ ను అలాగే ఉంచే రోడ్డు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు రోడ్డుపై పారే నీరు డ్రైనేజీలోకి వెళ్లే రంధ్రాలనూ సిమెంట్ తో మూసేశారని మండిపడ్డారు.
పార్క్ చేసిన బైక్ ను అలాగే ఉంచేసి రోడ్డు వేయడంపై వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్పందించారు. అసలు ఆ ప్రాంతంలో రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్ కు తాము అనుమతి ఏమీ ఇవ్వలేదని.. రోడ్డు ఎలా వేశారని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు సదరు కమిషనర్. కమిషనర్ మాట్లాడుతూ..”ఈ ఘటనతో మేమూ ఆశ్చర్యపోయాం. ఇలాంటివి ప్రభుత్వానికి, మున్సిపల్ కార్పొరేషన్ కు చెడ్డపేరు తెస్తాయి. ఇలాంటి చర్యలను సహించం. ఈ ఘటనకు బాధ్యుతుడైన కాంట్రాక్టర్ కు నోటీసు జారీ చేశాం. దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం..” అని కమిషనర్ పేర్కొన్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.