సాధారణంగా వర్కింగ్ టైమ్ లో నిద్రపోయేందుకు ఏ కంపెనీ ఒప్పుకోదు. కానీ కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తాయి. అందుకోసం వారి ఆరోగ్యానికి సంబంధించి అనేక బెనిఫిట్స్ ను కంపెనీలు ఇస్తుంటాయి. ఈ క్రమంలో ఉద్యోగుల సౌకర్యం కోసం కొన్ని విషయాల్లో అనుమతులు కూడా ఇస్తుంటాయి. ఈక్రమంలో కొన్ని కంపెనీ ఇచ్చే ఆఫర్ లో విచిత్రంగా ఉంటాయి. తాజాగా ఓ కంపెనీ.. వర్క్ అవర్స్ లో నిద్రపోయేందుకు అనుమంతిచింది. మరి నిద్రపోయే బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆ కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆఫీసులో పనిచేసేటప్పుడు అప్పుడప్పుడు నిద్రరావడం సహజం. అలా వచ్చిన నిద్ర వలన పనిలో తప్పులు జరిగే అవకాశం ఉంది. అందుకు బెంగుళూరుకు చెందిన వేక్ ఫిట్ సొల్యూషన్స్ అనే సంస్థ ఉద్యోగులకు నిద్రపోయే అవకాశాన్ని కల్పించింది. రోజుకు అరగంట పాటు నిద్రపోవచ్చని ఆఫర్ ఇచ్చింది. నిద్రకు సంబంధించిన ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేస్తుంది. పరుపులు, పిల్లోస్ వంటివి నిద్రకు సంబంధించిన ఉపకరణాలను తయారు చేస్తుంటుంది. నిద్రపోయే విషయం గురించి కంపెనీ అధికారులు మాట్లాడుతూ.. పగటి నిద్ర విషయంలో ఇన్నాళ్లూ న్యాయం చేయలేకపోయమని, అందుకే ఈ అంశాన్ని సీరియస్ తీసుకున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: కాలువలో కొట్టుకు వచ్చిన రూ.2000 నోట్ల కట్టలు!
నిద్రమత్తులో ఉద్యోగులు సరిగ్గా పనిచేయలేరు. అదే కాసేపు నిద్ర రూపంలో విశ్రాంతి తీసుకుంటే, మిగిలిన టైమంతా బాగా పని చేస్తారని కంపెనీ యజమాన్యం తెలిపింది. నాసా సర్వే ప్రకారం.. 26 నిమిషాల కునుకు తీస్తే, 33 శాతం పనితీరు మెరుగైందట. దీనివల్ల పగటి నిద్ర కునుకు ఎంత అవసరమో అర్థ చేసుకోవచ్చు. అప్పుడప్పుడూ కొన్ని సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీలు నిద్ర పోయేందుకు అనుమతిస్తాయి. విదేశాల్లోని చాలా కంపెనీలు ఎప్పట్నుంచో ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి.మరి.. ఈ కంపెనీ ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.