అందరూ ఈ జీవితం క్షణ కాలం అంటారు. అయితే.., విధిరాత ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈ భూమిపై ఇంకా బతకాలని రాసి పెట్టి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం నుండి అయినా బయటపడవచ్చు. తాజాగా ముంబై కళ్యాణ్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ముంబై కళ్యాణ్ రైల్వే స్టేషన్ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. అయితే.. ఈ స్టేషన్ లో లిఫ్ట్ సౌకర్యం లేదు. దీంతో.., ఓ 70 ఏళ్ళ వృద్ధుడు ట్రాక్ పై నుండి బయటకి వెళ్లాలని ప్రయత్నించాడు. ఇలా ట్రాక్ దాటుతూ ఉండగా అదుపు తప్పి పట్టాలపై పడిపోయాడు. అంత మంది జనం ఉన్నా.., పట్టాలపై పెద్దాయన పడిపోయిన విషయాన్ని ఎవ్వరూ ముందుగా గమనించలేదు. తరువాత ఆయన కేకలు వేయడంతో అంతా అటువైపు చూశారు.
అదే సమయంలో వారణాసి- ముంబై ఎక్స్ ప్రెస్ రైలు ఆ పట్టాల వైపే దూసుకొస్తుండటంతో ఎవ్వరూ ఆ పెద్దాయన్ని కాపాడే ప్రయత్నం చేయలేకపోయారు. కానీ.., ట్రైన్ డ్రైవర్ మాత్రం పట్టాలపై ఓ వృద్ధుడు ఉన్నట్టు దూరం నుండే గమనించాడు. ట్రైన్ కి, వృద్దుడికి మధ్య డిస్టెన్స్ తక్కువే ఉన్నా, ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ట్రైన్ ని ఆపేశాడు ఆ డ్రైవర్. బ్రేక్ వేసినా.., ట్రైన్ చాలా దూరం ముందుకి వచ్చి.., సరిగ్గా ఆ వృద్ధిని తాకుతూ ఆగిపోయింది. దీంతో ఆ వృద్ధుడు ఇంజిన్ కిందకి వెళ్ళిపోయాడు. రైల్వే సిబ్బంది అంతా వచ్చి.., ఆ ముసలాయన్ని చాకచక్యంగా బయటకి తీశారు.
ఈ ఘటనలో వృద్దుడికి చిన్న చిన్న గాయాలు కావడంతో చికిత్స అందించారు. నిజానికి డిస్టెన్స్ తక్కువగా ఉన్న సమయంలో ట్రైన్ డ్రైవర్స్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడానికి సాహసించరు. జరగరానిది ఏమైనా జరిగితే ఊహించలేనంత నష్టం జరుగుతుంది. కానీ.., ఇక్కడ మాత్రం డ్రైవర్ రిస్క్ తీసుకోవడంతో ఆ వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక విధి నిర్వహణలో చురుగ్గా ఉండి ఓ ప్రాణాన్ని కాపాడినందుకు ఈ లోకో సిబ్బందికి ప్రభుత్వం 20 వేల రూపాయల బహుమానం అందిచడం విశేషం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
A senior citizen who came under a #Mumbai–#Varanasi train while crossing tracks was saved in the nick of time at #Kalyan station. #MiddayNews pic.twitter.com/tposK9x9j6
— Mid Day (@mid_day) July 18, 2021