ఫిల్మ్ డెస్క్- ప్రిన్స్ మహేశ్ బాబు సర్కార్ వారి పాట సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిలేరు నీకెవ్వరు మూవీ తరువాత మహేశ్ చేస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారువారి పాట సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుండగా, నవీన్ ఏర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. సర్కారువారి పాట చిత్రానికి సంబందించి ఇప్పటికే విడుదల చేసిన ప్రీ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తన అభిమాన హీరో మహేశ్ బాబు సర్కారువారి పాటకు సంబందంచి మరో అప్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈమేరకు చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 31న చిత్ర బృందం మహేశ్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతోంది.
సర్కారువారి పాట సినిమాకు సంబంధించిన ఫస్ట్ నోటీస్‌ను 31న విడుదల చేయనున్నారు. ఈ ఫస్ట్ లుక్‌లో మహేశ్ బాబు ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇక ఇందుకు సంబంధించి గురువారం ఓ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో మహేశ్‌బాబు బ్యాగ్ పట్టుకుని ఉండగా, చుట్టూ బైక్‌లు, కార్లు, కొంద మంది రౌడీలతో యాక్షన్ సీన్‌లా కనిపిస్తోంది. మరి ఫస్ట్ నోటీస్ ఏవిధంగా ఉండబోతోందోనని మహేశ్ బాబు అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.