హైదరాబాద్- మీరు మీ శ్రేయోభిలాషి సినిమా చూశారా.. పలు సమస్యలతో సతమతమవుతున్న వారంతా వేర్వేరుగా ఆత్మహత్య చేసుకోలానుకుంటే, వారందరిని రాజేంద్రప్రసాద్ ఒక దగ్గరకు చేర్చి, వారిలో మార్పు తేవాలని ప్రయత్నిస్తాడు కదా. ఐతే ఈ సినిమాలో చివరికి బస్ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో కొంత సేపు ఉత్కంఠ నెలకొంటుంది. కానీ చివరికి ఆత్మహత్య చేసుకోవాలన్న వారందరిలో మాత్రం మార్పు వస్తుంది.
ఇదిగో సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది. ఐతే అందరు కలిసి కాదు గాని, ఎవరికి వారు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. మొత్తం ఐదు మంది సూసైడ్ చేసుకునేందుకు హుస్సేన్ సాగర్ దగ్గరకు వచ్చారు. ఇలా ఆత్మహత్యలు చేసుకునే వారిని ఎప్పుడూ ఓ కంట కనిపెట్టే హుస్సేన్ సాగర్ లేక్ పోలీస్ వారందరిని గుర్తించి, సకాలంలో వారు ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలిగారు.
శుక్రవారం మొత్తం ఐదు మంది హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. భర్త వేధింపులు తాళలేక డిప్రెషన్ తో ఇద్దరు మహిళలు ఆత్మహత్యయత్న చేసుకోబోయారు. కాని వెంటనే లేక్ పోలీస్ వారిని గుర్తించి వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఇక ఆర్థిక సమస్యలతో మరో మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈమెను కూడా లేక్ పోలీస్ కాపాడారు.
అంతే కాదు ప్రేమ విఫలమైందని మరో యువతి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యా చేసుకోబోయింది. సీసీ కమెరాలో గుర్తించిన లేక్ పోలీస్ వెంటనే అప్రమత్తమై, ఆ యువతిని కాపాడారు. ఇక మరో మహిళ కుటుంబ సమస్యలతో మద్యానికి బానిసై హుస్సేన్ సాగర్ దగ్గర ఆత్మహత్యా చేసుకోబోతె, ఈమెను కూడా లేక్ పోలీస్ కాపాడారు. ఇలా శుక్రవారం మొత్తం ఐదు మందిని సాగర్ లేక్ పోలీస్ కాపాడి, వారందరికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.