ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సమరం ముగిసింది. కొత్త ఛాంపియన్‌గా ఇంగ్లాండ్ అవతరించింది. ఇంక ఇప్పుడు అన్ని జట్లు తర్వాతి సిరీస్‌ల కోసం సమాయత్తం అవుతున్నాయి. వరల్డ్ కప్‌లో సెమీస్‌తోనే వెనుదిరిగిన టీమిండియా- న్యూజిలాండ్ జట్లు టీ20- వన్డే సిరీస్‌లలో పాల్గొననున్నాయి. టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్ చేరుకుంది. ఇండియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్-2022లో భాగంగా మొత్తం 3 టీ20లు, 3 వన్డేల్లో భారత్- న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఈ సిరీస్‌లో రోహిత్, విరాట్, కేఎల్ రాహుల్‌లకు విశ్రాంతి ఇచ్చారు.
నవంబర్ 18 నుంచి వెల్లింగ్టన్ వేదికగా.. టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టీ20 సిరీస్‌కు సంబంధించిన ఒక కమర్షియల్ ఫొటో షూట్ కూడా నిర్వహించారు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాలు ట్రోఫీతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే ఫొటోలు దిగుతున్న సమయంలో జోరుగా గాలి వీచింది. అప్పుడు ఫొటోల కోసం ఏర్పాటు చేసిన ట్రోఫీ కింద పడబోయింది. వెంటనే స్పందించిన కేన్ మామ ట్రోఫీని ఒడిసిపట్టుకున్నాడు. అంతేకాకుండా ఈ ట్రోఫీని నేనే ఉంచుకుంటాను అంటూ కామెంట్ చేశాడు. కేన్ మామ చేసిన ఆ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందుకు సంబంధించిన వీడియో న్యూజిలాండ్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కొందరైతే ట్రోఫీ న్యూజిలాండ్ కొట్టబోతోందని సింబాలిక్‌గా చెప్పారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
“I’ll have that!” 🙌 🏆 #NZvIND #CricketNation pic.twitter.com/KiQL8IkzUK
— BLACKCAPS (@BLACKCAPS) November 16, 2022