ఫిల్మ్ డెస్క్- కాజల్ అగర్వాల్.. మొన్నటి వరకు దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఐతే పెళ్లి తరువాత సినిమాలు తగ్గిస్తూ వచ్చిన ఈ చందమామ, ప్రస్తుం ప్రెగ్నెన్సీతో ఉండటం వల్ల ఒప్పుకున్న సినిమాలన్నింటిని క్యాన్సిల్ చేసుకుంటోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. బిడ్డను కన్నాక కొన్నాళ్ల పాటు కుటుంబాంతో గడపాలని కాజన్ భావిస్తోందట.
ఇదిగో ఇటువంటి సమయంలో కాజల్ అగర్వాల్ చేసిన పనికి అంతా అవాక్కైపోతున్నారు. ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో కాజల్ ఇలా చేస్తుందని ఎవరు ఊహించలేదు. ఇంతకీ కాజల్ ఏంచేసిందే కదా మీ ప్రశ్న. అసలేం జరిగిందంటే.. కాజల్ అగర్వాల్ ఓ విస్కీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన భర్తతో కలిసి కాజల్ షేర్ చేసిన ఫోటోలు, చేసిన కామెంట్లు, విస్కీ తాగండి అంటూ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.
కాజల్ తాజాగా ఓ ప్రముఖ బ్రాండ్ విస్కీ గురించి ఓ పోస్ట్ పెట్టింది. మన పార్ట్నర్ ఇలా సాయంకాలం పెగ్గు కలుపుకుని తాగుతూ మన పక్కనే ఉంటే.. వీకెండ్ అలా సరదాగా గడిచిపోతోంది.. అని కాజల్ చెప్పుకొచ్చింది. అంతే కాదు బాధ్యతతో తాగండి.. 25 ఏళ్లకు పైబడిన వారికే ఇది వర్తిస్తుంది.. అనే కాజల్ పలు సూచనలు కూడా చేసంది.
ఇంకేముంది కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో పెట్టి పోస్ట్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. డబ్బులు చాలడం లేదా, ఇంకా ఇలాంటివి కూడా ప్రమోట్ చేయాలా.. అంటూ జనాలు మండిపడుతున్నారు. అన్నట్లు స్టార్ హీరోయిన్లు ఈ మధ్య మద్యం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటున్నారు. ఒక్కో హీరోయిన్ ఒక్కో బ్రాండ్‌ను ప్రమోషన్స్ చేస్తోంది. ఇలియానా, రెజీనా, పూజా హెగ్డే వంటి హీరోయిన్లు సైతం మద్యం బ్రాండ్ల కోసం ముందుకు వస్తున్నారు.