ఫిల్మ్ డెస్క్- యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మెగా హీరో రాంచరణ్ తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కోసం ఎన్టీఆర్ యూనిట్ తో కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు సంబందించిన ఓ అంశం సంచలనం రేపుతోంది.
ఎన్టీఆర్ కు సహజంగానే కార్లంటే పిచ్చి. మార్కెట్లోకి వచ్చే ప్రతి బ్రాండ్ కారు తన గ్యారేజ్ లో ఉండాలని కోరుకుంటారు ఎన్టీఆర్. కార్ల తరువాత ఎన్టీఆప్ ఇష్టపడేది వాచ్ లను. ప్రపంచంలోని ఖరీదైన వాచ్ తన చేతికి ఉండాలని కోరుకుంటారు ఎన్టీఆర్. ఇదిగో ఇప్పుడు ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ చర్చనీయాంశంగా మారింది. మరి ఆ వాచ్ ప్రత్యేక ఏంటనేదానిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు కదా. తాజాగా జరిగిన ఆర్‌ఆర్‌ర్ ప్రెస్‌మీట్‌లో ఎన్టీఆర్ చేతికి ధరించిన వాచ్‌పై అందరి దృష్టి పడింది. అది చాలా స్పెషల్‌గా ఉండడంతో, దీని ధర ఎంత ఉంటుందబ్బా అని చాలా మంది గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర తెలియడంతో చాలా మందికి దిమ్మతిరిగిపోయింది. ఆ వాచ్ ధర దాదాపు 5,14,800 డాలర్లు. అంటే మన భారత కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల నాలుగు కోట్ల రూపాయలు.
ఎన్టీఆర్ ధరించిన వాచ్ రిచర్డ్ మిల్లే ఆర్ఎస్ కు చెందిన 011 కార్బన్ ఎన్పీటీ గ్రోస్జీన్ వాచ్. ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన వాచ్ లతో ఇది ఒకటన్నమాట. ఈ బ్రాండ్‌లో లభించే ప్రతి వాచ్ చాలా ఖరీదైనదేనని చెప్పాలి. ఎన్టీఆర్ ఇష్టంతో ఈ వాచ్ కొలుగోలు చేశాడని సన్నిహితులు చెబుతున్నారు. ఇలాంటి వాచ్ లు ఆయన దగ్గర మరో రెండు ఉన్నాయని సమాచారం. తనకి నచ్చితే కారైనా, వాచ్ అయినా ఎంత ధరైనా కొనేస్తారని ఎన్టీఆర్ కు ముందగానే పేరుంది.