కలికాలం అంటే ఇదే కాబోలు.. మనుషుల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తింటున్నాయి. కొంతమంది వావివరుసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. మరి కొంతమంది బరితెగించి రక్త సంబంధీకులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇక, అప్పుడప్పుడు జనమే సిగ్గుతో తల దించుకునే.. ఇదే యవ్వారంరా బాబు.. అనే సంఘటనలు కూడా జరుగుతున్నాయి. తాజాగా, అలాంటి ఓ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తను తల్లితో.. చెల్లితో పంచుకుంటోంది. ఈ వింత, వికారమైన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన మాడి బ్రూక్స్ అనే మహిళ కొద్దిరోజుల క్రితం తన టిక్‌టాక్ ఖాతాలో వరుసగా కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది. ఆ వీడియోల్లో.. ‘‘ నేను, మా అమ్మ స్వింగర్స్(భాగస్వాములను మార్చుకునే సందర్భంలో ఈ పదాన్ని వాడుతారు) అది చాలా గొప్ప విషయం కూడా.. ఎందుకంటే? నాకు మూడు లేకపోతే నా భర్తను ఆమె దగ్గరకు పంపిస్తాను. అవును. నేను అలాంటి భార్యనే.. నేను వారంలో కొన్ని రోజులు నా భర్తను ఆమెతో ఉండనిస్తాను. నా భర్తను నేను ఎలా సుఖపెడుతున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారా? అతడ్ని నా చెల్లెలితో కూడా ఉండనిస్తాను’’ అని పేర్కొంది.
మొత్తానికి తన భర్తను తల్లితో.. చెల్లితో పంచుకుంటానని చెప్పింది. ఒకరి తర్వాత ఒకరం.. ముగ్గురు కలిసి భర్తతో శృంగారంలో పాల్గొంటామని ఓపెన్‌గా వివరించింది. ప్రస్తుతం ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఆ వీడియోలు మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఇక చాలు ఇప్పటికే టిక్‌టాక్‌ను ఎక్కువగా వాడేశా.. నే వెళ్లిపోతా’’.. ‘‘ నాకు తెలియట్లేదు ఎవరైనా తమ భర్తను ఎలా పంచుకుంటారు’’.. ‘‘ ఇలా కూడా చేయొచ్చని మీకెలా అనిపించింది మేడమ్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, భర్తను తన తల్లితో.. చెల్లితో పంచుకుంటున్న సదరు మహిళపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: అర్ధరాత్రి సూపర్ మార్కెట్లో ఎలుగుబంటి! అక్కడ ఏం చేసిందంటే..