ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు బాగానే జరుగుతున్నాయి. తాజాగా కరేబియన్ దీవుల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. డొమినికన్ రిపబ్లిక్ లో ఓ విమానం కుప్పకూలింది. నగరంలో ఉన్న లాస్ అమెరికాస్ ఎయిర్పోర్ట్లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు సిబ్బంది కాగా.. ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. విషయాన్ని ప్రైవేటు జెట్ నిర్వహణ సంస్థ హెలిడోసా ఏవియేషన్ గ్రూప్ అధికారికంగా ధృవీకరించింది. ప్రయాణికుల్లో ఆరు మంది విదేశీయులు కాగా.. ఒకరు డొమినికన్ దేశానికి చెందినవారని పేర్కొంది.
ఈ దుర్ఘటనలో ప్రముఖ లాటిన్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఫ్లోలా మూవీ ఆయన భార్య, కుమారుడితో ఉన్నారని అధికారులు వెల్లడించారు. లాస్ అమెరికాస్ ఎయిర్ పోర్టు సమీపంలో నుంచి దట్టమైన పొగలు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదంలో విమానం ముక్కలయిపోయింది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి.
ఇదీ చదవండి : ఖగోళ చరిత్రలో అద్బుతం.. తొలిసారి సూర్యుడిని తాకిన వ్యోమనౌక..!
ప్రమాదానికి గురైన ఎయిర్క్రాఫ్ట్.. లా ఇసాబెలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లోరిడా వెళ్లాల్సి ఉందని తెలిపారు స్థానిక అధికారులు. అయితే సాంకేతిక కారణాల వల్ల విమానాన్ని అత్యవసర ల్యాండిగ్ చేస్తుండగా.. విమానం కుప్పకూలినట్లు వెల్లడించారు. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు.
Nine dead in Dominican Republic plane crash, reports AFP News Agency quoting the airline pic.twitter.com/aXcbJTafWF
— Journalist Siraj Noorani (@sirajnoorani) December 16, 2021