ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక గత కొన్ని రోజులుగా.. అతడికి సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. ఇమ్రాన్ ఖాన్.. ఓమహిళతో మాట్లాడిన సంభాషణలు లీకవ్వడంతో.. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక రాజకీయాల సంగతి పక్కన పెడితే.. తాజాగా మరోసారి ఇమ్రాన్‌ఖాన్ పేరు తెర మీదకు వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య.. మూడో వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఆమె తన కంటే 13 ఏళ్ల చిన్న వ్యక్తిని వివాహం చేసుకోవడం గమనార్హం. ఆ వివరాలు..
ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య.. రెహమ్ ఖాన్.. మూడో వివాహం చేసుకుంది. అమెరికాకు చెందిన మాజీ మోడల్, బిలాల్‌ను పెళ్లి చేసుకుంది. ఇద్దరికి ఇది మూడో వివాహం కావడం గమనార్మం. రెహమ్ ఖాన్ వయసు 49 ఏళ్లు కాగా.. మీర్జా బిలాల్ వయసు 36 ఏళ్లు. వివాహం తర్వాత.. రెహమ్ ఖాన్.. ‘‘మీర్జా బిలాల్ తల్లిదండ్రులు ఆశీస్సులతో సీటెల్‌లో మేము వివాహం చేసుకున్నాం.. నా కొడుకు నాకు లాయర్‌గా వ్యవహరించాడు’’ అంటూ పెళ్లి ఫోటో షేర్ చేసింది. దాంతో పాటు.. చివరకు నేను అత్యంత విశ్వసించే వ్యక్తి మిర్జా బిలాల్ చేయిందుకున్నాను అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.
పాకిస్థాన్ టీవీ జర్నలిస్ట్ అయిన రెహమ్ ఖాన్‌కు 2015 జనవరిలో ఇమ్రాన్ ఖాన్‌తో వివాహం జరిగింది. అయితే ఈ పెళ్లి ముణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. విబేధాల కారణంగా.. వివాహ అయిన పది నెలలకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సందర్భం దొరికిన ప్రతి సారి.. తన మాజీ భర్త ఇమ్రాన్‌పై విమర్శలు గుప్పిస్తూనే ఉంది రెహమ్. ఇక ఇమ్రాన్ విషయానికి వస్తే.. రెహమ్‌తో విడాకుల తర్వాత.. 2018లో బుష్రా వాట్టోను మూడో పెళ్లి చేసుకున్నాడు.
ఇమ్రాన్ తొలుత బ్రిటన్ బిలయనీర్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. 1992 పాకిస్తాన్‌కు ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్… క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత 1995లో బ్రిటన్ బిలియనీర్ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహమాడాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయాడు. ఆ తర్వాత రెహమ్‌ను వివాహం చేసుకున్నాడు.
Finally found a man who I can trust @MirzaBilal__ pic.twitter.com/nx7pnXZpO6
— Reham Khan (@RehamKhan1) December 23, 2022