మనిషికి విశ్రాంతి ఎంతో అవసరం.. ఉదయం లేచిన మొదలు ఏదో ఒక పని చేస్తూ అలసిపోయి రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్రిస్తుంటారు. కంటినిండా నిద్ర ఉంటే మనసు, శరీరం రిలాక్స్ గా ఉంటుంది అంటారు.
ప్రపంచంలో కోటీశ్వరుడైనా.. కటిక పేదవాడికైనా నిద్ర అనేది తప్పనిసరి. అలసిన శరీరానికి కాస్త విశ్రాంతి అవసరం అనిపించినప్పుడు నిద్రపోతాం. కంటినిండా నిద్ర ఉంటే రిలాక్స్‌గా ఉంటుంది. ఈ రోజుల్లో ఒత్తిడి, ఆందోళన, అనారోగ్యం కారణంగా చాలామంది నిద్ర లేమితో బాధపడుతున్నారు. నిద్ర దైనందిన జీవితంలో ప్రతి జీవికి అవసరం. నిద్ర పోవడం వల్ల మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు. ఓ 70 ఏళ్ల వృద్దుడు ఏకంగా 30 ఏళ్ల పాటు నిద్రలేకుండా ఉన్నాడు. వివరాల్లోకి వెళితే..
మనం ఒక్కరోజు నిద్రపోకపోతే ఎంతో అలసిపోయినట్లు.. కళ్లు లాగేస్తున్నట్లు అనిపిస్తుంది. అలాంటిది సౌదీలోని ఓ 70 వృద్దుడు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30 ఏళ్లుగా నిద్రలేకుండా గడుపుతున్నాడు. ఇది వింటానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా.. వాస్తవం. సదరు వృద్దుడికి 30 ఏళ్లుగా ఎందుకు నిద్ర పట్టడం లేదో వైద్యులకు సైతం అంతుచిక్కడం లేదు. మరి ఆ పెద్దమనిషి ఎందుకు నిద్ర పోవడం లేదో అన్న విషయం గురించి తెలుసుకుందాం..
సౌదీలోని బాహా రీజియన్‌లో 70 ఏళ్ల సౌద్ బిన్ ముహ్మద్ అల్ ఘమ్దీ నివాసముంటున్నారు. మిలటరీలో ఉద్యోగం చేసి కొంతకాలం క్రితం రిటైర్ మెంట్ తీసుకున్నారు. ఉద్యోగం చేసే సమయంలో ఓ ఆపరేషన్ జరిగింది. దీంతో ఆయన దాదాపు 20 రోజులపాటు నిద్రలేకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిటైర్ మెంట్ తీసుకున్న కొద్ది రోజుల తర్వాత నిద్రలేమి సమస్య మొదలైంది. అలా మొదలై ఏకంగా 30 సంవత్సరాలనుండి నిద్రలేమి జబ్బుతో బాధపడుతున్నారు. విచిత్రం ఏంటంటే.. బిన్ ముహ్మద్ నిద్రపోనప్పటికీ ఎలాంటి అనారోగ్య సమస్య లేదు. మానసికంగా, శారీరకంగా ఫిట్ గానే ఉన్నారు. ఆ పెద్దాయనకు వచ్చిన అంతు చిక్కని వ్యాధి ఏమిటో డాక్టర్లు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఈ వింత జబ్బుపై మీ కామెంట్స్ తెలియజేయండి.