మనం ఎన్నో సినిమాల్లో ఆపదలో ఉన్నవారిని సూపర్ హీరోలు రక్షించడం చూస్తుంటాం. ఇక స్పైడర్ మాన్, హీమాన్, సూపర్ మాన్ లాంటి హీరోలు ఎలాంటి ఆపదలో ఉన్నవారినైనా గాల్లోకి ఎగిరి మరీ వారిని ఆపద నుంచి రక్షిస్తుంటారు. ఇలాంటి సీన్లు థియేటర్లో కూర్చొని చూస్తుంటే తెగ ఎంజాయ్ చేస్తాం.. అలాంటిది నిజ జీవితంలో జరిగితే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కళ్ల ముందు ఘోరం జరుగుతుంటే.. సెల్ఫీలు తీసుకుని ఆనందించే జనాలు ఉన్న ఈ రోజుల్లో, తన ప్రాణాలకు తెగించి ఎనిమిదో అంతస్తు కిటికీ నుంచి జారి పోతున్న ఓ చిన్నారిని కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆ రియల్ హీరో పేరు సబిత్ సంతన్‌బయేవ్. ఈ సంఘటన కజకస్థాన్‌లో లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
నుర్ సుల్తాన్‌లో నివసిస్తున్న సబీత్ తన స్నేహితుడితో కలిసి ఆఫీసుకు వెళ్తున్న సమయంలో వారికి జనాల హాహాకారాలు వినిపించాయి. ఓ చిన్నారి ఎనిమిదో అంతస్తు కిటికీకి వేలాడుతూ కనిపించింది. వెంటనే తన స్నేహితుడితో కలిసి ఏడో ఫ్లోర్‌లోకి వెళ్లి అతడి ఫ్రెండ్ కాళ్లను పట్టుకుంటే.. సబిత్ కిటికీ నుంచి బయటకు వచ్చాడు. ఎలాంటి సహాయం లేకుండా ధైర్యం చేసి కిటికీ పైకి వచ్చి పాపను పట్టుకొని ఏడో అంతస్థు కిటికీ నుంచి తన స్నేహితుడికి అప్పగించాడు. సబిత్ సంతన్‌బయేవ్ చేస్తున్న సాహసాన్ని ఉత్కంఠంగా వీక్షించారు అక్కడున్నవారు. చిన్నారికి కాపాడిన సబిత్ సంతన్‌బయేవ్ ప్రశంసలతో ముంచెత్తారు.
ఇక సుబిత్ చేసి సాహసం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం గుర్తించింది. డిప్యుటీ ఎమర్సెన్సీ మినిస్టర్ పతకంతో సత్కరించారు. సుబిత్ కి ముగ్గురు ఆడ పిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిటికీ నుంచి జారిపోతున్న పాపను చూస్తే తన పాప గుర్తుకు వచ్చిందని.. కేవలం ఆ చిన్నారికి సాయం చేయాలని అనుకున్నా అంతే అని తెలిపాడు. ఈ కాలంలో కూడా తమ ప్రాణాలకు తెగించిన ఇంత గొప్ప సాహసం చేసిన సబిత్ సంతన్‌బయేవ్ మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.