సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అలనాటి అందాలతార బారీ యంగ్‌ఫెలో ఇటీవల తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. హాలీవుడ్ లోని 1980ల ‘సిట్ కామ్ ఇట్స్ ఎ లివింగ్’ మూవీలో పోషించిన జాన్ హాఫ్ మేయర్ గ్రే పాత్ర ద్వారా సూపర్ క్రేజ్ దక్కించుకుంది బారీ యంగ్‌ఫెలో. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బారీ తన 75 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.
ఇక బారీ మరణించిన వార్తను ఆమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటించారు. “ఆమె ఒక మంచి స్నేహితురాలిగా.. ఎంతోమందిని స్నేహితులను సంపాదించుకుంది. ఎంతో నమ్మకమైన మంచి మనిషి. ఆమె జీవితంలో ఎంచుకున్న మంచి కథలు, పాత్రలే ఆమె జీవిత భావాన్ని వ్యక్తం చేస్తాయి” అని ఆమె ఫ్యామిలీ రాసుకొచ్చింది. కానీ బారీ మరణానికి అసలు కారణం ఏంటనేది వెల్లడించలేదు.
బారీ యంగ్‌ఫెలో 1946 అక్టోబర్ 22న ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో జన్మించింది. 1970లలో టెలివిజన్ వైపు అడుగేసే ముందు బారీ.. పీటర్ పాన్ ప్రొడక్షన్స్ లో కెరీర్ ప్రారంభించింది. ఇక 1973 ‘ది న్యూ టెంపరేచర్స్ రైజింగ్’ షో ఎపిసోడ్ లో మొదటగా కనిపించింది. ఆ తర్వాత ది స్ట్రీట్స్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో, ఫెర్న్‌వుడ్ 2 నైట్, సిన్సినాటి లాంటి అనేక టీవీ షోలలో మెరిసింది. ప్రస్తుతం బారీ మరణంతో హాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.