గూగుల్ పై 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.750 కోట్ల) జరిమానా విధిస్తూ రష్యాలోని ఓ జిల్లా న్యాయస్థానం ఆదేశిలిచ్చింది. స్థానిక చట్టాలకు అనుగుణంగా నిషేధించిన కంటెంట్ ను తొలగించడంలో గూగుల్ విఫలమైనందున ఈ జరిమాన వేసినట్లు తెలుస్తోంది. నిషేధించిన కంటెంట్ ను తొలగించాలని ఎన్నిసార్లు సూచించినా గూగుల్ పట్టించుకోకపోవడంతో.. రష్యాలోని టగాన్ స్కై జిల్లా న్యాయస్థానం అడ్మినిస్ర్టేటివ్ ఫైన్ కింద 720 కోట్ల రూబెల్స్ ( మన కరెన్సీలో సుమారు రూ.750 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది.
న్యాయస్థానం ఉత్తరువులను పరిశీలించి తదుపరి చర్యలకు దిగుతామని గూగుల్ ప్రకటించింది. మరోవైపు సామాజిక మాధ్యమ ప్లాట్ ఫామ్ లపై రష్యా అధికారులు స్థిరంగా ఒత్తిడి పెంచుతున్నారు అనే గూగుల్ వాదన. అయితే మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ఆయుధాలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన కంటెంట్ ను తొలగించడంలో టెక్నాలజీ కంపెనీలు విఫలమవుతున్నాయనేదీ ఇక్కడ ప్రధాన అభియోగం.
ఇది కూడా చదవండి : పిల్లలను కనే కొత్త జంటలకు బ్యాంకు రుణాలు
గతంలోనూ రష్యాలోని పలు న్యాయస్థానాలు గూగుల్, ఫేస్ బుక్, ట్విటర్ లపై చిన్న మొత్తంలో జరిమానాలు విధించిన విషయం తెలిసిందే. గూగుల్ పై తొలిసారి భారీ మొత్తంలో జరిమానాను న్యాయస్థానం విధించడం గమన్హారం. గూగుల్ పై రష్యాలోని జిల్లా న్యాయస్థానం భారీ మొత్తంలో జరిమాన విధించడంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.