ఉక్రెయిన్ దేశానికి చెందిన లీవ్ నగరం పోలాండ్ సరిహద్దుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రాంతంలో అడుగు పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి రష్యా దళాలు. ఈ క్రమంలో రెండు రోజులుగా రష్యా దళాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. రష్యా సైన్యం బుల్లెట్, బాంబులకే కాదు.. బీర్ సీసాలను ఎదుర్కొని ప్రాణాలు కోల్పోతుంది. ఈ దెబ్బకి ఏమి అర్థంగాక రష్యా బలగాలు అక్కడే నిలిచిపోయాయి.
మరి ఇంతకీ ఆ బీర్ సీసాలు గాల్లోంచి పడటం ఏంటి..? అవి పేలి మా సైన్యం ప్రాణాలు కోల్పోవడం ఏంటని ఆశ్చర్యపోతోంది రష్యా. అయితే.. బీర్ సీసాలు ఎందుకు బాంబుల కంటే పవర్ ఫుల్ మారణాయుధాలుగా మారాయో కారణాలు చెప్పుకొచ్చారు ప్రావ్డా బ్రూవరీ అనే బీర్ల తయారీ కంపెనీ యజమాని యూరై జాస్టనీ.
లివ్ నగరానికి చెందిన ప్రావ్డా బ్రూవరీ కంపెనీ బీర్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. కానీ, యుద్ధం కారణంగా బీర్ల తయారీ నిలిపేసింది. అయితే.. తాగే బీర్ కి బదులుగా రష్యా బలగాలను అంతం చేసేందుకు ‘‘మొలటోవ్ కాక్ టెయిల్’ అనే బీర్ ప్రత్యేకంగా తయారు చేస్తోంది. ఇప్పుడవి బీర్ సీసాలు కాదు.. ఆ రూపంలో ఉన్న బాటిల్ బాంబులు అని తెలిపారు కంపెనీ యజమాని యూరై జాస్టనీ.
ఈ బీర్ బాంబుల తయారీ ఎలా?
బీర్ బాటిళ్లలో ఆయిల్, పెట్రోల్ మిక్స్ చేసి బాంబులుగా ఉపయోగిస్తున్నారు. ఆ సీసాలో గుడ్డను ముంచి శత్రు సైన్యం రష్యా బలగాలపై విసిరేస్తున్నారు. సీసాలో ఉండే కాక్ టెయిల్ కి కూడా పెట్రోల్, ఆల్కహాల్ లాగే మండే గుణం ఉంటుంది. సీసా మూత భాగంలో గుడ్డకు అగ్గి రాజేసి విసిరితే శత్రువుల పని అయిపోయినట్టే అంటున్నారు.
ప్రస్తుతం ఉక్రెనియన్ టెర్రిటోరియల్ డిఫెన్స్ ఫోర్స్ కోసం ఈ బీర్ బాంబుల తయారీ మొదలైందట. 2014 క్రిమియా సంక్షోభం సమయంలో కూడా శత్రు బలగాల మీద ఇటువంటి దాడులు జరిగినట్లు సమాచారం. ఇక కంపెనీలో పని చేసిన ఓ వ్యక్తి.. ఇటీవల బాటిల్ బాంబుల తయారీ గుర్తు చేయడంతో మళ్లీ బీర్ బాటిల్ బాంబులు తయారీ చేస్తున్నారు.
‘ఈ యుద్ధానికి మా వంతు కృషి చేస్తాం. 2014లో దీన్ని తయారు చేసి వినియోగించారు. అదీగాక.. మా ఉద్యోగి ఒకరికి ‘మెలటోవ్ కాక్ టెయిల్’ తయారీ తెలుసు. అందుకే ఇప్పుడు తయారు చేస్తున్నాం’ అని తెలిపారు యూరై. ఇదిలా ఉండగా.. ఈ కంపెనీ గతంలో ‘పుతిన్ ఖుయ్లో’ అని పుతిన్ ని అవమానిస్తూ బీర్లు తయారు చేసింది. అవి భారీ స్థాయిలో అమ్ముడు పోవడం విశేషంగా చెప్తున్నారు. మరి ఈ బీర్ బాంబుల తయారీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
