రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శిక్షణ సమయంలో రష్యా సైనిక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరొకరు గాయపడ్డారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తూర్పు అముర్ ప్రాంతంలోని క్రాస్నోయరోవో గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక కారణాలతో టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఇందులో ఆరుగురు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. జనవాసాలు లేని ప్రదేశంలో విమానం కుప్పకూలడంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేప్టటారు.ఫ్లైట్ క్రాష్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో.. కుప్పకూలగానే విమానం ఇంధనం ట్యాంకులు పేలిపోవడంతో భారీగా మంటలు చెలరేగడం కనిపించింది.
ఘటన జరిగిన సమయంలో విమానంలో ఏడుగురు ఉన్నారు. విమానం బయల్దేరిన కొద్దిసేపటికే నిర్మానుష్య ప్రాంతంలో కుప్పకూలిపోయింది. దీంతో విమానంలోని ఆరుగురు మరణించగా.. ఒకరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన ఒక్కరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం కూలడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని రష్యా అధికారులు వెల్లడించారు.
