రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శిక్షణ సమయంలో రష్యా సైనిక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరొకరు గాయపడ్డారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తూర్పు అముర్ ప్రాంతంలోని క్రాస్నోయరోవో గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక కారణాలతో టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఇందులో ఆరుగురు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. జనవాసాలు లేని ప్రదేశంలో విమానం […]