SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Russia Plague Bacteria Leak Lab Technician Death Quarantine

రష్యాలో ప్లేగు బ్యాక్టీరియా లీక్? ల్యాబ్ టెక్నీషియన్ మృతి.. 200 మందికి క్వారంటైన్

  • Written By: Ayyappa Panja
  • Published Date - Mon - 5 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ల్యాబ్‌లో ప్లేగ్ బ్యాక్టీరియా లీక్..రష్యాలో క్వారంటైన్ టెన్షన్

రష్యాలో ప్రమాదకరమైన ప్లేగు వ్యాధి వ్యాప్తి భయాలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సైబీరియాలోని యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే 28 ఏళ్ల షిపిలోవా అనే మహిళా ల్యాబ్‌ టెక్నీషియన్ మృతి చెందడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్లేగు వ్యాప్తి కారణంగానే ఆమె మృతిచెందినట్లు అంతా భావిస్తున్నారు. అయితే రష్యా ప్రజారోగ్య అధికారులు మాత్రం ఆమె మృతికి నిమోనియా కారణమని చెబుతున్నారు. ఆమె శరీరంలో ప్రమాదకర సూక్ష్మజీవులను గుర్తించలేదని వెల్లడించారు.

Advertisement

రష్యాలోని సైబీరియా సెర్చ్ ల్యాబ్‌లో జరిగిన ప్రమాదం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను ఆందోళనకు దారితీసింది. అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో నిండిన ఒక టెస్ట్ ట్యూబ్ ప్రమాదవశాత్తూ పగిలిపోవడంతో.. 28 ఏళ్ల యువ ల్యాబ్ టెక్నీషియన్ “దార్యా షిపిలోవా” ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఈ టాపిక్ వరల్డ్ వైడ్‌గా టెన్షన్ పెడుతుంది. సెప్టెంబరు 25న ప్రయోగశాలలో ప్లేగు బ్యాక్టీరియా ఉన్న టెస్ట్‌ ట్యూబ్‌ పగిలినట్లు సమాచారం. ఆ తర్వాత షిపిలోవా అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందారం టూ స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. ఆమెతో సన్నిహితంగా ఉన్న కుటుంబసభ్యులు, సిబ్బంది దాదాపు 200 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచారు. పలు ఆసుపత్రుల్లో క్వారంటైన్‌ చర్యలు చేపట్టారు. ఐదు ఆసుపత్రులను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. అయితే క్వారంటైన్‌లో ఉన్నవారిలో ఇప్పటివరకు వ్యాధి లక్షణాలు కనిపించలేదని అధికారులు తెలిపారు. ప్లేగు వ్యాప్తిపై ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ.. వ్యాధి వ్యాపించినట్లు ఇప్పటివరకు ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 29న ఆమెను తీవ్రమైన నిమోనియా లక్షణాలతో షెలెఖోవ్ జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. ఊపిరి పీల్చుకోవడం కష్టమవ్వడంతో వెంటనే వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో అఆమె కన్నుమూసింది. అయితే, తను చనిపోయే ముందు.. ల్యాబ్‌లో లైవ్ బ్యాక్టీరియా టెస్ట్ ట్యూబ్ పగిలిపోయిన విషయాన్ని స్వయంగా వైద్యులకు చెప్పడంతో ఒక్కసారిగా అధికారులు ఉలిక్కిపడ్డారు!

ఈ ఘటనతో రష్యా రక్షణ, ఆరోగ్య శాఖలు హై అలర్ట్ ప్రకటించాయి. దార్యా షిపిలోవాతో ప్రత్యక్షంగా, పరోక్షంగా పరిచయం ఉన్న దాదాపు 200 మందిని గుర్తించి వెంటనే ఐసోలేషన్ క్వారంటైన్‌కు తరలించారు. అంతేకాదు.. ఆ ప్రాంతంలోని దాదాపు ఐదు ఆసుపత్రులను అధికారులు క్వారంటైన్ జోన్లుగా మార్చి, కఠిన ఆంక్షలు విధించారు. ఇర్కుట్స్క్ నగరంలో జరగాల్సిన భారీ బహిరంగ కార్యక్రమాలను కూడా ముందస్తు జాగ్రత్తగా రద్దు చేశారు. అయితే.. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ నెలకొంది! రష్యా ప్రభుత్వ కేంద్ర ఆరోగ్య సంస్థ మాత్రం ల్యాబ్‌లో ఎలాంటి ప్రమాదమూ జరగలేదని, ఆమె ప్లేగ్ వల్ల చనిపోలేదని బుకాయిస్తోంది. ఆమె మృతికి కారణం కేవలం “గుర్తుతెలియని నిమోనియా” అని చెప్తూ, ఆ నమూనాలలో ప్లేగ్ కారకాలు దొరకలేదని ప్రకటన విడుదల చేసింది. గతంలో కరోనా సమయంలో కూడా నిజాలు దాచిపెట్టిన రష్యా.. ఇప్పుడు ఈ ‘ప్లేగ్ లీక్’ విషయాన్ని కూడా కప్పిపుచ్చడానికే ప్రయత్నిస్తోందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఊపిరితిత్తులకు సోకే ఈ ‘న్యుమోనిక్ ప్లేగ్’ అనేది గాలి తుంపర్ల ద్వారా ఒకరి నుండి ఒకరికి అత్యంత వేగంగా వ్యాపిస్తుంది, సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన WHO, CDC వంటి అంతర్జాతీయ సంస్థలు రష్యాలోని ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. రష్యా ప్రభుత్వం ఈ ల్యాబ్ ప్రమాదంపై పూర్తి సమాచారాన్ని ప్రపంచ దేశాలతో పారదర్శకంగా పంచుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. మరి ఈ ల్యాబ్ లీక్ నిజంగానే మరో కొత్త ముప్పుకు దారితీస్తుందా? లేక స్థానికంగానే కట్టడి అవుతుందా? అనేది వేచి చూడాలి.

Tags :

  • Lab Leak
  • Plague Bacteria
  • Plague Outbreak
  • Russia News
  • Russia Quarantine
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ క్రాష్..ఆరుగురు మృతి

టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ క్రాష్.. ఆరుగురు మృతి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రెండో అంతస్తు నుంచి పడిన బాలుడు.. గాల్లోనే పట్టుకుని కాపాడిన యువకుడు

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • రష్యాలో ప్లేగు బ్యాక్టీరియా లీక్? ల్యాబ్ టెక్నీషియన్ మృతి.. 200 మందికి క్వారంటైన్

  • బ్రెయిన్‌పై అద్భుత పరిశోధన.. ముగ్గురికి నోబెల్ అవార్డ్

  • సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • హైదరాబాద్ మాజీ మేయర్ అల్లంపల్లి పోచయ్య కన్నుమూత

  • వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam