రష్యాలో ప్రమాదకరమైన ప్లేగు వ్యాధి వ్యాప్తి భయాలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సైబీరియాలోని యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే 28 ఏళ్ల షిపిలోవా అనే మహిళా ల్యాబ్ టెక్నీషియన్ మృతి చెందడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్లేగు వ్యాప్తి కారణంగానే ఆమె మృతిచెందినట్లు అంతా భావిస్తున్నారు. అయితే రష్యా ప్రజారోగ్య అధికారులు మాత్రం ఆమె మృతికి నిమోనియా కారణమని చెబుతున్నారు. ఆమె శరీరంలో ప్రమాదకర సూక్ష్మజీవులను గుర్తించలేదని వెల్లడించారు. రష్యాలోని సైబీరియా సెర్చ్ ల్యాబ్‌లో […]