ఈ మద్య భూమి, ఆకాశంలోనే కాదు సముద్ర ప్రాంతాల్లో కూడా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పరిమితికి మించి ప్రయాణీకులతో వెళ్తున్న నౌకలు అనుకోకుండా ప్రమాదాలకు గురి అవడం.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.
ఇటీవల భూమి, ఆకాశం, సముద్రం ప్లేస్ ఏదైనా.. ప్రమాదాలు మాత్రం కామన్ అయ్యాయి. భూమిపై వాహనాలు.. ఆకాశంలో విమాన ప్రమాదాలు.. సముద్రంలో బోటు మునిగిన సంఘటనల్లో ఎంతోమంది చనిపోతున్నారు.. వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. తాజాగా ఇటలీలో సముద్ర తీరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న ఓ భారీ నౌక ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళితే..
100 మంది శరణార్థులతో కూడిన ఓ నౌక దక్షిణ ఇటలీ సముద్ర తీరంలో మునిగిపోయింది.. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది శరణార్థులు మృత్యువాతపడ్డారు. కాలబ్రియా ప్రాంతంలోని తీరప్రాంత పట్టణమైన క్రోటోన్ సమీపంలో ఈ దుర్ఘలట జరిగినట్లు తెలుస్తుంది. నౌక లంగర్ వేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అనుకోకుండా ప్రమాదానికి గురై భారీ బండరాయిని ఢీ కొట్టడంతో పడవ మునిగిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో సుమారు 40 మంది వరకు మరణించి ఉంటారని రీసార్ట్ బీచ్ లో మృత దేహాలను స్వాధీనం చేసుకున్నాట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం పేదరికం, గొడవలు, ఆర్థిక కష్టాల కారణంగా ప్రతి సంవత్సరం ఆఫ్రికా నుంచి ఇటలీకి వేల సంఖ్యల్లో శరణార్థులు వస్తుంటారని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో నౌకలో సుమారు 100 మంది ఉన్నారని.. పరిమితికి మించి ఓడలో ప్రయాణం చేస్తున్నారని.. ఇటాలియన్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారి తెలిపారు. మృతుల్లొ ఓ చిన్నారి కూడా ఉందని.. సహాయక చర్యల్లో రక్షణ సిబ్బంది, బార్డర్ పోలీస్, అగ్ని మాపక సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు.
Dozens of people killed, including a baby, after migrant boat sinks off Italy coast https://t.co/C9iACXhwx6
— BBC News (World) (@BBCWorld) February 26, 2023