ఫిల్మ్ డెస్క్- క్యాస్టింగ్ కౌచ్.. సినిమా ఇండస్ట్రీలో చాలా సహజంగా వినిపించే మాట. బాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు క్యాస్టింగ్ కౌచ్ మామూలే. కాకపోతే ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ పై చాలా మంది నటీమణులు బయటపడుతున్నారు. తాము ఇండస్ట్రీలో ఎదుర్కొన్న లైంగిక దాడుల గురించి మెల్లమెల్లగా చెబుతున్నారు. గత కాొన్నాళ్లుగా క్యాస్టింగ్ కౌచ్ పై విప్లవం మొదలైందని చెప్పవచ్చు. అయినప్పటికీ ఎక్కడ ఓ చోట క్యాస్టింగ్ కౌచ్ జరుగుతూనే ఉంది.
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజాగా జరిగిన ఘటనే ఇందుకు ఉదాహారణగా చెప్పుకోవచ్చు. హీరోయిన్ నేహ సక్సేనా తాను తమిళ సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై సంచలన విషయాలను బయటపెట్టారు. మొన్నామధ్య నేహ సక్సెనా ఓ తమిళ సినిమాలో నటించింది. ఆ సినిమా దర్శకుడు, ఆయన కొడుకు వల్ల తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఓ ఇంటర్వూలో చెప్పింది నేహ సక్సెనా.
అసలు డైరెక్టర్ తనకు ముందు చెప్పిన కధ ఒకటైతే, సినిమా తీసింది మరో కధ అని ఆవేధన చెందింది నేహ. ఇక షూటింగ్ సమయంలో దర్శకుడు కావాలని తనపై వేధింపులకు పాల్పడ్డాడని, అసభ్య పదజాలంతో తిట్టేేవాడని చెప్పింది. తన హోటల్ రూంకు వచ్చి లైంగిక దాడికి పాల్పడేవాడని, ఎదురిస్తే కొట్టేవాడని చెప్పుకుని ఎడ్చేసింది నేహ సక్సేనా. ఇక ఈ సినిమాలో డైరెక్టర్ కొడుకే హీరోగా నటించాడట.
ఇంకేముంది దర్శకుడి కొడుకు సైతం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని హీరోయిన్ నేహ సక్సేనా
వాపోయింది. తన అసిస్తెంట్ లేనప్పుడు హోటల్ రూంకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించడం, హీరో ఉన్న హోటల్ రూంకు నన్ను రమ్మని వేధించడం, చెప్పినట్లు వినకపోతే ఫోన్ చేసి చెప్పుకోలేని అసభ్యకరమైన మాటలు మాట్లాడటం చేసేవాడాని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. బయటకు చెప్పుకుంటే తానే అల్లరిపాలవుతానని ఇన్నాళ్లు ఓపిక పట్టానని చెప్పుకొచ్చింది. నేహ సక్సెనా ఆరోపణలు ఇప్పుడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీట్ పుట్టిస్తున్నాయి.