ఒకప్పుడు సినీ సెలబ్రిటీలు అంటే కేవలం వెండితెర మీద మాత్రమే కనిపించేవారు.. బుల్లితెర మీద స్టార్లు కనిపించడం అంటే.. అప్పట్లో చాలా రేర్. అది కూడా స్టార్ హీరోయిన్, హీరోలు.. బుల్లితెర కార్యక్రమాల్లో కనిపించడం చాలా అరుదుగా ఉండేది. కానీ కాలం మారుతున్న కొద్ది.. కొన్ని కొన్ని పద్దతులు కూడా మారాయి. ఒకప్పుడు వెండితెరే గ్రేట్.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. టెలివిజన్.. వెండితెరకు గట్టి పోటీ ఇస్తుంది. సీరియల్స్, సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట షోలతో బుల్లితెర రికార్డులు సృష్టిస్తోంది. ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బుల్లితెర షోలలో సందడి చేస్తోన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి.. తొలిసారి ఓ బుల్లితెర గేమ్ షోలో సందడి చేయబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..
యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గలగల ప్రవహించే మాటల ప్రవాహం. ఏళ్లుగా బుల్లితెర మీద యాంకర్‌గా రాణిస్తోంది. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో యాంకరింగ్‌కు బ్రేక్ ఇస్తున్నానంటూ సుమ మీద కట్ చేసిన ప్రోమో తెగ వైరలవ్వడమే కాక సుమను విమర్శల పాలు చేసింది. అసలు విషయం ఏంటంటే.. సుమ చేసిన షోస్‌లో ‘క్యాష్’ షో చాలా పాపులర్ అయింది. ఇందులో ఎంతో మంది సెలబ్రెటీలు సందడి చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు హాజరయ్యారు. అయితే ఇటీవలే ఆ షోకి సుమ ఫుల్ స్టాప్ పెట్టి.. ‘సుమ అడ్డా’ అనే కొత్త షో ను స్టార్ట్ చేసింది. దీని గురించి చెప్పడం కోసం డిఫరెంట్‌గా ట్రై చేసి.. విమర్శల పాలయ్యారు.
ఇక సుమ అడ్డా తొలి ఎపిసోడ్‌కి సంబంధించి ఇప్పటికే ప్రోమో వదిలారు. సంతోష్ శోభన్ టీమ్ తొలి ఎపిసోడ్‌లో సందడి చేశాడు. ఇక రెండో ఎపిసోడ్.. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రసారం కానుందట. ఈ క్రమంలో రెండో ఎపిసోడ్‌కి మెగాస్టార్ చిరంజీవి, డైరక్టర్ బాబీ గెస్ట్‌లుగా రానున్నారని టాక్. చిరంజీవి.. బుల్లితెర మీద ఓ గేమ్ షో లాంటి దానికి హాజరుకావడం పెద్ద విషయమే. గతంలో ఆహాలో సమంత చాట్ షోలో ఆయన పాల్గొన్నారు. అయితే అది టాక్ షో మాత్రమే కాక.. ఓటీటీ వేదికగా టెలికాస్ట్ అయ్యింది. హోస్ట్ కూడా స్టార్ హీరోయిన్ సమంత. కాబట్టి చిరంజీవి.. ఆ షోకి హాజరవ్వడం ఎవ్వరిని ఆశ్చర్యపరచలేదు. అలాంటిది.. చిరు.. బుల్లి తెర మీద గేమ్ షో పాల్గొని సందడి చేయడం మాత్రం.. చాలా ప్రత్యేకమే. మరి బుల్లితెర మీద చిరంజీవి సందడి ఎలా ఉండబోతుందో చూడాలింటే.. మరి కొన్నాళ్లు ఆగాలి.
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవితో పాటు.. మాస్ మహారాజా రవితేజ ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మెగా మాస్ పూనకాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్నారు. ఆదివారం ప్రీరిలీజ్ వేడుకు జరగనుంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలున్నాయి. చాలా రోజుల తర్వాత చిరంజీవిని.. ఫుల్ లెంత్ మాస్ రోల్‌లో చూడబోతున్నారు ప్రేక్షకులు. చిరు మాస్ యాక్షన్‌కు.. మిరపకాయ్ రవితేజ .. మాసిజం కూడా యాడ్ కావటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దానికి తగ్గట్టుగానే.. వాల్తేరు వీరయ్య థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.72.5 కోట్లుగా జరిగింది తెలుస్తోంది.ఈ సంక్రాంతికి మెగాస్టార్ హిట్ కొట్టడం పక్కా అని అభిమానులు చెబుతున్నారు.