అక్రమ ఆస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం, ఆ తరువాత బెయిల్ పై బయటకి వచ్చిన ఆయన.. ఏపీ సీఎం కావడం అందరికీ తెలిసిన విషయాలే. అయితే.., పార్టీ అంతర్గతంగా ఏర్పడిన కలహాల కారణంగా.. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ ధఖాలు చేశారు. ఈ వ్యాజ్యంపై తాజాగా సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఇటు విజయసాయిరెడ్డి పిటిషన్‌పైనా వాదనలు ముగియగా.. సెప్టెంబర్ 15న రెండు కేసులను కలిపి తీర్పు వెల్లడిస్తామని సీబీఐ కోర్టు తెలిపింది.
అక్రమ ఆస్తుల కేసులో జగన్ పై మొత్తం11 చార్జ్ షీట్ల నమోదై ఉన్నాయి. ఈ కేసుల నుండి ఆయన కడిగిన ముత్యంలా బయట పడి, రాజీలేని పరిపాలన అందించాలన్నదే నా ముఖ్య ఉద్దేశం అని రఘురామ లిఖిత పూర్వకంగా తన వాదనని తెలియచేశాడు. మరోవైపు ఈ విషయంలో జగన్ తరపు న్యాయవాదులు కూడా లిఖితపూర్వకమైన వాదనలు కోర్టుకు సమర్పించారు. ఇవన్నీ పరిశీలించినాకనే సీబీఐ కోర్టు తీర్పుని సెప్టెంబర్ 15కి వాయిదా వేసింది.
ఈ కేసులో సీబీఐ అధికారులు మాత్రం.. జగన్ కి బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనే విషయాన్ని కోర్టుకు విచక్షణ అధికారానికి వదిలేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15న కోర్టు ఎలాంటి తీర్పు వెలువడిస్తుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ కొనసాగుతోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.