కాళ్లు, చేతులు.. శరీరంలో అన్ని అవయవాలు సరిగా ఉండి.. ఒంట్లో సత్తువ ఉన్నప్పటికి కొందరికి పని చేయాలంటే బద్దకం. చదువు అయిపోయినప్పటికి కూడా ఎలాంటి పని చేయకుండా.. తిని, ఖాళీగా తిరుగుతుంటారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. పుట్టుకతోనే ఎన్నో లోపాలు. శరీరం పూర్తిగా ఎదగలేదు. అయినప్పటికి ధ్రుడ సంకల్పంతో వైకల్యాన్ని ఎదిరించి.. జీవితంలో ముందుకు వెళ్తున్నాడు.
కష్టమైనప్పటికి.. పని చేసుకుంటూ.. భార్య, బిడ్డలను పోషిస్తున్నాడు. ఇతడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టికి చేరింది. ఈ క్రమంలో సదరు వికలాంగుడి సంకల్పానికి ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా అతడికి సాయం చేస్తానని తెలిపాడు. ఆ వివరాలు..
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి పుట్టుకతోనే వికలాంగుడు. అతడి చేతులు, కాళ్లు పూర్తిగా ఎదగలేదు. అయినా ఏ మాత్రం భయపడకుండా.. ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. బైక్ ఇంజన్ ని పూర్తిగా మార్చి.. తనకు కావాల్సిన విధంగా ఓ కొత్త యంత్రంలా మార్చుకున్నాడు. దీని సాయంతో డెలివరీలు చేస్తుంటాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి.. రోడ్డు మీద వెళ్తుండగా.. చూసిన కొందరు అతడి అనుమతితో ఈ వీడియో తీశారు.
వికలాంగ వ్యక్తి మాట్లాడుతూ.. నాకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, వయసు పైబడిన తండ్రి ఉన్నారు. వారందరిని పోషించడం కోసం ఇలా పని చేస్తున్నాను. గత ఐదేళ్లుగా ఈ వాహనం సాయంతో పని చేసుకుంటున్నాను’’ అని తెలిపాడు. ఇక అతడి సంకల్పాన్ని చూసిన వారు ప్రశంసలు కురిపిస్తుంటే.. సదరు వ్యక్తి చిరునవ్వుతో.. అంతా దేవుడి దయ అని ముందుకు సాగిపోయాడు.
ఇందుకు సంబంధించిన వీడియోని ట్విటర్ లో షేర్ చేయడంతో తెగ వైరలయ్యింది. సదరు వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఈ వీడియో కాస్త ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడటంతో.. ఆయన సాయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఈ వీడియోని తన ట్విటర్ లో షేర్ చేస్తూ.. ఈ రోజు ట్విటర్ లో ఈ వీడియో నా దృష్టికి వచ్చింది.. ఇది ఎప్పటిది.. ఎక్కడ తీశారు అనే వివరాలు ఏవి నాకు తెలియవు. కానీ ఈ వ్యక్తి నన్ను ఎంతో అబ్బురపరిచాడు. వైకల్యాన్ని జయించి.. ధ్రుడ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. అతడు చేస్తున్న పని ఎంతో గొప్పది అని ప్రశంసించడమే కాక.. కోలిగ్ రామ్ ని ట్యాగ్ చేసి.. రామ్ మన మహీంద్రాలోగ్ ద్వారా ఇతడికి ఎలాంటి సాయం చేయగలమో చూడండి అని కోరారు.
ఆనంద్ మహీంద్రా ఈ వీడియోని రీట్వీట్ చేసిన తరువాత.. సుమారు 50 వేల మంది దీన్ని విక్షించారు. అతడు ఎక్కువగా దక్షిణ ఢిల్లీ మెహ్రౌలి ప్రాంతంలో తిరుగుతుంటాడని తెలిపారు. అతడిని ఆదుకోవాలని భావస్తున్న ఆనంద్ మహీంద్ర మంచి మనుసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఆనంద్ మహీంద్రా చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.