ఫిల్మ్ నగర్– దీపావళి పండగ రోజు సినిమా హీరో రాజశేఖర్ ఇంట్లో విషాధం నెలకొంది. దీపావళి పండగను సంతోషంగా జరుపుకుంటున్న సమయంలో రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ కన్నుమూశారు. 93 ఏళ్ల వయసున్న వరదరాజన్ గోపాల్ గత కొన్ని రోజులుగా వయోభారంతో వచ్చిన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
దీంతో వరదరాజన్ గోపాల్ ను పైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం దీపావళి పండగరోజు ఆయన పరిస్థితి విషమించింది. సాయంత్రం వరదరాజన్ గోపాల్ కన్నుమూశారు. దీంతో హీరో రాజశేఖర్ ఇంట్లో విషాదం నెలకొంది.
వరదరాజన్ గోపాల్ బౌతికఖాయాన్ని హైదరాబాద్ నుంచి విమానంలో చెన్నైకి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యుల సందర్శన తరువాత స్థానిక స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వరదరాజన్ గోపాల్ చెన్పై డీసీపీగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు మొత్తం అయిదగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
హీరో రాజశేఖర్, వరదరాజన్ గోపాల్ కు రెండో సంతానం. చాలా కాలంగా వరదరాజన్ గోపాల్ హైదరాబాద్ లో రాజశేఖర్ దగ్గరే ఉంటున్నారు. అన్నట్లు హీరో రాజశేఖర్ ప్రస్తుతం శేఖర్ అనే సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఆ సినిమాను షూటింగ్‌ను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు ప్రాజెక్టులు కధా చర్చల దశలో ఉన్నాయి.