ట్రైలర్ చివర్లో తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ఇమిటేట్ చేయడం ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ ట్రైలర్‌లో చిరు, పవన్‌తో పాటు మరో హీరోని కూడా ఇమిటేట్ చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో రాజశేఖర్, జీవిత దంపతుల గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం లాంటి చిత్రాల్లో నటించిన ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీకి ఎంతో మంది నట వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో రాజశేఖర్ దంపతుల కూతుళ్లు శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల శివానీ రాజశేఖర్.. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. తాజాగా ఈ పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ […]
ఫిల్మ్ నగర్– దీపావళి పండగ రోజు సినిమా హీరో రాజశేఖర్ ఇంట్లో విషాధం నెలకొంది. దీపావళి పండగను సంతోషంగా జరుపుకుంటున్న సమయంలో రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ కన్నుమూశారు. 93 ఏళ్ల వయసున్న వరదరాజన్ గోపాల్ గత కొన్ని రోజులుగా వయోభారంతో వచ్చిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో వరదరాజన్ గోపాల్ ను పైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం దీపావళి పండగరోజు ఆయన పరిస్థితి విషమించింది. […]