యాంకర్ రష్మి తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పిక్స్ లో రష్మి అచ్చం ఆ స్టార్ హీరోయిన్ లా ఉందంటున్నారు నెటిజన్లు. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మనం చాలా సందర్భాల్లో వింటుంటాం. ఇక కొన్ని కొన్ని సార్లు అరేయ్ నీలాంటి వ్యక్తికి ఫలానా ఊర్లో చూశాను అంటుంటారు. ఇండస్ట్రీకి చెందిన కొంత మంది హీరోయిన్ లు కొన్ని కొన్ని సార్లు వేరే హీరోయిన్ లా కనిపిస్తూ.. ఆకట్టుకుంటూ ఉంటారు. ఇప్పటికే అషు రెడ్డిని జూనియర్ సమంతలా ఉందంటూ గతంలో చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా మరో యాక్టర్ ను స్టార్ హీరోయిన్ లా ఉన్నావంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోల్చుకొస్తున్నారు. అవును యాంకర్ రష్మి తాజాగా తన సోషల్ మీడియాలో చీర కట్టులో ఉన్న కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. ఈ పిక్స్ ను చూసిన అభిమానులు అచ్చం ఆ స్టార్ హీరోయిన్ లా ఉన్నావ్ అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
యాంకర్ రష్మి.. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ గా మెరిసింది. అయితే ఆ సినిమాల ద్వారా ఆమెకు గుర్తింపు రాలేదు. ఇక రష్మికి గుర్తింపు తీసుకొచ్చిన షో ఏదైనా ఉంది అంటే అది ఒక్క జబర్దస్త్ అనే చెప్పాలి. జబర్దస్త్ యాంకర్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. ఇక కమెడియన్ సుధీర్ తో ఈ అమ్మడు కెమిస్ట్రీ సూపర్. దాంతో రష్మి-సుధీర్ జోడీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక తన యాంకరింగ్ తో.. తన అందచందాలతో కుర్రకారు మనసు దోచుకుంది రష్మి. అదీకాక అడపాదడపా సినిమాల్లో నటిస్తూ.. తనకంటూ ఓ గుర్తింపును క్రియేట్ చేసుకుంది. ఇక రష్మి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది అన్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా పద్దతైన చీరకట్టులో మెరిసింది ఈ జబర్దస్త్ భామ. మత్తెక్కించే చూపులతో, వీపు అందాలతో.. కుర్రకారును రెచ్చగొడుతోంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజన్స ఈ పిక్ పై పలు విధాలుగా స్పందించడమే కాక.. నువ్వు అచ్చం ఆ స్టార్ హీరోయిన్ లా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మి నువ్వు ఈ చీర కట్టులో అచ్చం లేడీ సూపర్ స్టార్ నయనతారలా ఉన్నావ్ తెలుసా? అని కొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తే.. ఈ పిక్స్ లో నువ్వు నయనతార చెల్లెలులా ఉన్నావ్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ కామెంట్లకు మరికొందరు రిప్లైలు ఇస్తూ.. నిజంగా అలాగే ఉంది అంటూ రాసుకొచ్చారు. మరి ఈ చీరలో నిజంగానే రష్మి లేడీ సూపర్ స్టార్ నయనతారలా ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.