ఇటీవల కాలంలో హీరోయిన్స్ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనబడుతుండటం మనం చూడొచ్చు. వెండితెరపై తమ అందాల ఆరబోతకు అవకాశాలున్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా మరింత బోల్డ్‌గా ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాషన్ , ట్రెండ్‌కు తగ్గట్లు బట్టలు వేస్తూ అలరిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా వేసుకున్న బట్టలపై నెట్టింట చర్చ జరుగుతున్నది. బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ మోడల్ ఊర్వశి రౌతెలా తన ఫొటో షూట్స్ తో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ లో ఉంటూనే ఉంది. రీసెంట్ గా ఈ ఊర్వశీ ఇటీవల సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోల్లో చిరుగులు ఉన్న డ్రెస్ ధరించింది. అయితే, నార్మల్‌గా చిరుగులు తక్కువ ఉంటే పెద్దగా పట్టించుకునే వారు కాదేమో. ఇంతగా చిరిగిన డ్రస్ ను కనీసం బిచ్చగాళ్లు కూడా వేసుకోరేమో అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఊర్వశి వేసుకున్న డ్రెస్‌కు బాగా చిరుగులు ఉన్నాయి. షర్ట్, ప్యాంట్ అన్నీ చిరిగిపోయే ఉన్నాయి. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు ఇదెక్కడి ఫ్యాషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. డబ్బులు ఎక్కువయ్యేకద్ది ఇలాంటి విపరీత పోకడలే కనిపిస్తుంటాయని నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. చిరిగిన డ్రెస్‌ను బిచ్చగాళ్లు కూడా వేసుకోబోరని, ఒక వేళ వేసుకున్నా కవర్ చేసుకుంటారని, కానీ ఊర్వశీకి ఆ మాత్రం కవరింగ్ సెన్స్ లేదని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. మొత్తంగా ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.