సాధారణంగా ఒక భాషలో సినిమాలను మరో భాషలోకి రీమేక్ చేయడం రెగ్యులర్ గా చూస్తుంటాం. ఈ సినిమాలను రీమేక్ చేయడంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పూర్తి సినిమాని కథా, కథనం, సీన్స్ తో సహా రీమేక్ చేయడం.. రెండోది కేవలం స్టోరీ లైన్ మాత్రమే తీసుకొని ఆయా హీరోలకు తగ్గట్టుగా, నేటివిటీకి సింక్ అయ్యేలా కొత్తగా రాసుకొని తీయడం జరుగుతుంది. ఇందులో రెండో పద్దతి ఫాలో అయితే రీమేక్ సినిమా అని ట్రోల్స్, విమర్శలు పెద్దగా రావు. అదే మొదటి ప్రాసెస్ ని ఫాలో అయితే ఖచ్చితంగా ఒరిజినల్ సినిమాతో పోల్చి ట్రోల్స్, విమర్శలు చేస్తుంటారు. మరి సీన్స్ తో సహా రీమేక్ చేసినప్పుడు కాపీ అని కూడా అంటారు.
ఇక్కడ విషయం ఏంటంటే.. ఒక సినిమాని మక్కీకి మక్కీ రీమేక్ చేసినా.. సన్నివేశాలు అయినా మారుతూ ఉండాలి. సరే సన్నివేశాలు మార్చారే అనుకుందాం.. కనీసం సాంగ్స్ అయినా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవాలి. సరే సాంగ్స్ కూడా కాపీ కొట్టారే అనుకోండి.. సాంగ్స్ లో కనిపించే సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ లైనా మార్చితే బాగుంటుంది అనేది వాదన. అవును.. ఇంతకీ ఈ సాంగ్స్ కాపీ సినారియో ఎప్పుడు, ఎవరి సినిమాలో జరిగింది? అనంటే.. దళపతి విజయ్ నటించిన ‘బద్రి’ సినిమాలో.. అదేంటీ! బద్రి సినిమా పవన్ కళ్యాణ్ ది కదా అనిపించవచ్చు. అవును.. పవన్ కళ్యాణ్ సినిమానే బద్రి పేరుతో రీమేక్ చేశాడు విజయ్. మరి చేసింది బద్రి సినిమానా? అంటే అదికూడా కాదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు'(1999) సినిమాని తమిళంలో బద్రి(2001) పేరుతో రీమేక్ చేశాడు విజయ్. తమ్ముడు సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కథాకథనాలతో పాటు పవన్ కళ్యాణ్ చేసిన రియల్ స్టంట్స్.. రమణ గోగుల సాంగ్స్.. యాక్షన్ సీక్వెన్సులు.. ఇలా అన్ని అదిరిపోయాయి. వెరసి.. బాక్సాఫీస్ వద్ద తమ్ముడు సినిమా బ్లాక్ బస్టర్. కట్ చేస్తే.. తమ్ముడు సినిమాని విజయ్ బద్రిగా రీమేక్ చేశాడు. అక్కడ కూడా సినిమా హిట్టే. కానీ.. పవన్ కళ్యాణ్ రియల్ స్టంట్స్ కి, విజయ్ రీల్ స్టంట్స్ కి తేడా ఉంది కదా అంటున్నారు ఫ్యాన్స్.
ఇక తాజాగా తమ్ముడు సినిమాకి రీమేక్ గా తీసిన బద్రి సినిమాని.. సినిమాలో రమణ గోగుల పాడిన ‘ట్రావెలింగ్ సోల్జర్’ సాంగ్ విజువల్స్ ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. తమ్ముడు సినిమాలో రమణ గోగుల పాడిన ఈ పాటలో పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న టాలెంట్ ని బయటపెట్టారు మేకర్స్. కానీ.. విజయ్ విషయానికి వచ్చేసరికి సీన్స్ కాస్త స్పూఫ్ లుగా మారిపోయాయి. ఆ సాంగ్ ఎలాగో ఇంగ్లీష్ లో ఉంటుంది కాబట్టి.. యాజ్ ఇట్ ఈజ్ విజయ్ సినిమాలో వాడేశారు. సో.. సాంగ్ లో పవన్ చేసిన ఫీట్స్ అన్ని విజయ్ తో చేయించారు.. పైగా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా గమనించవచ్చు. ముందు వ్యాన్ కి పోటీగా రన్నింగ్ చేసిన విజయ్.. ఎండింగ్ కి వచ్చేసరికి వ్యాన్ కి అడ్డంగా వెళ్లి పరుగెత్తడం కామెడీ అయిపోయింది.
అలాగే పవన్ కళ్యాణ్ పైన మార్బల్స్ పెట్టి సుత్తితో పగలగొట్టిన సీన్ బాగుంటుంది.. కానీ, ఆ సీన్ కి ఎక్సట్రాగా విజయ్ పై నుండి పెద్ద డ్రమ్ ఒకటి లాగించేశారు.. అలా కారు సీక్వెన్స్, కొబ్బరి బొండాలు.. వెయిట్ లిఫ్టింగ్ మాత్రమే కాకుండా స్కిప్పింగ్ కూడా యాడ్ చేసి కామెడీ చేయడం.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ కి కారణం. ఇదిలా ఉండగా.. తెలుగులో హిట్ అయిన చాలా సినిమాలు విజయ్ తమిళంలో రీమేక్ చేశాడు. అయితే.. ఇప్పుడు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ‘వారసుడు’ సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతోంది. చూడాలి మరి వారసుడు మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో!