ప్రముఖ దర్శకులు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. దేశ వ్యాప్తంగా పుష్ఫ మూవీ డైలాగ్స్, సాంగ్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించిన చిత్రం పుష్ప. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పలికే తగ్గేదే లే డైలాగ్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది.
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా, ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ డైలాగ్ ను బన్నీ స్టైల్లో అదరగొట్టారు.. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశాయి. ఇదిలా ఉంటే.. అన్ని భాషల్లో శ్రీవల్లి పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఈ పాటలో అల్లు అర్జున్ ఓ స్టెప్పు వేస్తూ చెప్పు జారవిడుచుకుంటాడు. తాజాగా టీమిండియా క్రికెటర్లు శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేశారు. టీమిండియా ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ బాలీవుడ్ శ్రీవల్లి సాంగ్ ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను పుష్ప చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
.@surya_14kumar & @ishankishan51 grooving to the melodious song #Srivalli 🤩#PushpaTheRise #BoxOfficeSensationPushpa pic.twitter.com/Y399HEAYvt
— Pushpa (@PushpaMovie) January 15, 2022