ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనారోగ్యం కారణంగా కొందరు, ఇతర కారణాలతో మరికొందరు మరణించారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ్ సింగర్ బంబా బాక్యా(49) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆరోగ్య సమస్యతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన బాక్యా.. చికిత్స పొందుతు గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. బాక్యా.. ఎక్కువగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ టీమ్ లో పాటలు పాడారు. చివరగా డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో ఓ సాంగ్ ఆపించాడు. తమిళ్ లో అనేక సినిమాలో సూపర్ హిట్ సాంగ్ పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన రోబో 2.0 చిత్రంలో పులినంగల్ అనే పాట పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బాంబా బాక్యా.
ఆ తర్వాత సర్కార్ సినిమాలో, పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో పలు పాటలు పాడారు. ఆయన ఎక్కువగా ఏఆర్ రెహామాన్ సినిమాల్లోని పాటలు పాడారు. సెప్టెంబర్ 1న రాత్రి బాక్యా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. బంబా బాక్యా మృతితో కోలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.బంబా మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
Rest In peace brother @bambabakya #bambabakya gone too soon … pic.twitter.com/q2jh1LzQr3
— Santhosh Dhayanidhi (@DhayaSandy) September 1, 2022