ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనారోగ్యం కారణంగా కొందరు, ఇతర కారణాలతో మరికొందరు మరణించారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ్ సింగర్ బంబా బాక్యా(49) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆరోగ్య సమస్యతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన బాక్యా.. చికిత్స పొందుతు గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. బాక్యా.. ఎక్కువగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ టీమ్ లో పాటలు పాడారు. […]