ఇటీవల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాతో కంబ్యాక్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం.. మలయాళం లూసిఫర్ మూవీకి అఫిషియల్ రీమేక్. పొలిటికల్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన గాడ్ ఫాదర్.. అక్టోబర్ 5న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రీమేక్ మూవీ అయినప్పటికీ, టీజర్ ట్రైలర్స్ తో అంచనాలు భారీగా సెట్ చేసింది. అయితే.. మొదటి షో నుండే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా.. కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో రీసెంట్ గా గాడ్ ఫాదర్ మూవీని సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ చెన్నైలో వీక్షించారు. బిగ్ స్క్రీన్ పై మూవీ చూసిన రజినీ.. గాడ్ ఫాదర్ పై స్పందించినట్లు దర్శకుడు మోహన్ రాజా ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. తాను తీసిన సినిమాను సూపర్ స్టార్ చూసేసరికి మోహన్ రాజా ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అలాగే సినిమాపై రజినీ ప్రశంసలు కురిపించినట్లు మోహన్ రాజా తెలిపారు. లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ ని తీర్చిదిద్దిన తీరు బాగుందని.. ఓరల్ గా సినిమా ఎక్సలెంట్.. నైస్.. ఇంటరెస్టింగ్ అని రజినీ చెప్పారని రాజా ట్విట్టర్ పోస్ట్ లో చెప్పుకొచ్చారు. అయితే.. సూపర్ స్టార్ తన సినిమాను ప్రశంసించడంతో మోహన్ రాజా ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశాడు.
ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను కలెక్షన్స్ దుమ్మురేపుతున్న గాడ్ ఫాదర్.. మొదటి వీకెండ్ లో 110కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దాదాపు 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన గాడ్ ఫాదర్.. వీకెండ్ వరకూ 55% కలెక్షన్స్ రికవరీ చేసిందని.. రానున్న మరికొద్ది రోజుల్లో పూర్తిగా టార్గెట్ కంప్లీట్ చేయనుందని మెగాఫ్యాన్స్ చెబుతున్నారు. అదీగాక మెగాస్టార్ మూవీపై సూపర్ స్టార్ ప్రశంసలు రావడంతో మెగాఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, మురళీశర్మ కీలకపాత్రలు పోషించగా.. సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.
Superstar watched #Godfather 😇
Excellent!! very nice!! very interesting!!! are few of the remarks in his detailed appreciation on the adaptions made for the Telugu version.
Thank u so much Thalaiva @rajinikanth sir, one of the best moments of life.. means a lotttt 🙏 pic.twitter.com/AFdT7oOoBe— Mohan Raja (@jayam_mohanraja) October 10, 2022