తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో బాగా పాపులర్ అయ్యింది. ఎన్ని కాంటవర్సీలు ఉన్నా ఈ షోకి ఆదరణ బాగా లభిస్తుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని 7వ సీజన్ లోకి అడుగుపెడుతోంది.
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హూస్ట్ చేయగా.. తర్వాత నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం కింగ్ నాగార్జున కంటిన్యూగా తెలుగు బిగ్ బాస్ కి హూస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని 7వ సీజన్ లోకి అడుగుపెడుతోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ లో పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ కి సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ లో బాగా పాపులర్ కావడంతో ఇతర భాషల్లో కూడా బిగ్ బాస్ ని పరిచయం చేశారు. తెలుగు లో ఇప్పటి వరకు బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో బిగ్ బాస్ 7 వ సీజన్ కి సిద్దం అవుతుంది. బిగ్ బాస్ లో సెలబ్రిటీలు, సామాన్యులు కూడా ఉంటారు. ఇక బిగ్ బాస్ ఇంట్లో అల్లర్లు, గొడవలు, అలకలు, భావోద్వేగాలు, సంతోషాలు ఇలా ఎన్నో మోషన్స్ ని ఒక చోట మిక్స్ చేసి చూపిస్తారు. ఇటీవల బిగ్ బాస్ షో పై పలు విమర్శలు వచ్చినా.. సీజన్ మొదలు కాగానే టీవీలకు అతుక్కుపోతారు ఆడియన్స్. గడిచిన సీజన్ ప్లాప్ అవ్వడంతో ఈ సీజన్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు నిర్వాహకులు.
గత కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించిన ప్రోమో వచ్చేసింది. మొన్నటి వరకు అసలు బిగ్ బాస్ సీజన్ 7 ఉంటుందా? ఉండదా ? అన్న సందేహాలు పటాపంచలు చేస్తూ బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఎలాంటి హంగామా లేకుండా ఈ ప్రోమో చాలా సింపుల్ గా వదిలారు. బిగ్ బాస్ లోగో.. బ్లూ అండ్ వైట్ కాంబినషన్ లో లెటర్స్ ఉంన్నాయి. ‘బిగ్ బాస్ ప్రోమో.. ఇక మొదలెడదామా? అంటూ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఈసారి మరింత కాంట్రవర్సీలకు తెరలేపే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ కి కూడా నాగార్జుననే హూస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం.