ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు సంబంధించి గుడ్ న్యూస్ అయినా.. బ్యాడ్ న్యూస్ అయినా ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. పాజిటివ్ న్యూస్ కంటే కూడా నెగిటివ్ న్యూస్ తొందరగా జనాల్లోకి వెళ్లిపోతుంది. సెలబ్రిటీల పెళ్లి వార్తలైనా లేట్ అవుతాయేమో గానీ, విడాకులు తీసుకోబోతున్నారని తెలిస్తే మాత్రం జనాలలో ఎక్కడలేని ఆసక్తి కనిపిస్తుంది. కొద్దిరోజులుగా ఓ స్టార్ క్రికెటర్ – స్టార్ టెన్నిస్ ప్లేయర్ కి సంబంధించి విడాకులు అంటూ కొన్ని వార్తలు తెగవైరల్ అవుతున్నాయి. ఎవరి గురించో మీకు అర్థమై ఉంటుంది. ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకుల బాటపడుతున్నారని రూమర్స్ గట్టిగా వినిపించాయి.
ఈ విషయం సానియా దంపతులకు చేరిందో లేదో గానీ.. ఇద్దరూ కలిసి ఫ్యాన్స్ కి ఓ షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. పాకిస్తాన్ క్రికెటర్, ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2010లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం వీరు దుబాయ్ లో ఉంటున్నారు. కాగా వీరికి 2018లో కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించాడు. అయితే.. వీరిద్దరూ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారని, విడిపోవాలని నిర్ణయించుకున్నారని మీడియాలో ఎన్నో కథనాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వీరిద్దరి మధ్యలో ఓ పాకిస్తానీ మోడల్ అడ్డుగా వచ్చిందని అక్కడి మీడియాలో కూడా కథనాలు వెలువడ్డాయి.
ఇలాంటి వేడి వాతావరణంలో మాలిక్ దంపతులు ఓ రియాలిటీ షో అనౌన్స్ మెంట్ తో అందరినీ సర్ప్రైజ్ చేశారు. విడిపోతారని భావించిన సానియా – షోయబ్.. కలిసి ఓ షోని హోస్ట్ చేయడానికి రెడీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పాపులర్ పాకిస్తానీ ఓటిటి ప్లాట్ ఫామ్ ‘ఉర్దూప్లెక్స్’లో సానియా – మాలిక్ షోని హోస్ట్ చేయనున్నట్లు సమాచారం. కపిల్ శర్మ షో తరహాలో.. వీరిద్దరూ ఇంటర్నేషనల్ క్రీడాకారులను ఇంటర్వ్యూ చేయనున్నారని తెలుస్తోంది. అదీగాక ఈ సరదా టాక్ షోలో సెలబ్రిటీల మనోభావాలు, మనోగతాలను కూడా బయటపెట్టనున్నారని అంటున్నారు. అలాగే ఈ షో కోసం ఇద్దరూ రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే తీసుకుంటున్నారని టాక్. అయితే.. షో ఎప్పుడు స్టార్ట్ అనేది తెలియలేదు. కానీ.. మొత్తానికి విడాకుల రూమర్స్ కి ఇలా అనౌన్స్ మెంట్ తో ఫుల్ స్టాప్ పెట్టేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.