టాలీవుడ్‌లోనే కాదు చలనచిత్ర పరిశ్రమలో సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం..అభినయంతో కుర్రోళ్ల హృదయాల్ని కొల్లగొట్టిన సమంత క్రేజ్ ఇటీవల కీలక విషయాలు వెల్లడించింది. అవేంటో ఓసారి చూద్దాం.
టాలీవుడ్ అందాల భామ సమంత క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. కొన్నేళ్లుగా సినిమాలకు దూరమై ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేస్తున్న సమంత క్రేజ్ ఇప్పటికీ అలానే ఉంది. ఏ మాయ చేశావేతో మాయ చేసిన సమంత ఇంకా మైమరపిస్తూనే ఉంది. త్వరలో మా ఇంటి బంగారం సినిమాతో మరోసారి తెరపై కన్పించనుంది. మైటాసిస్ వ్యాధితో బాధపడిన సమంత కొద్దికాలం సినిమాల నుంచి దూరం పాటించింది. అంతకుముందు నాగ్ చైతన్యతో విడాకులు తీసుకోవడంతో కాస్త ఒత్తిడికి లోనయింది. ఇక సమంత సినిమాలు చేయదనే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే ఇటీవల తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్ర హల్‌చల్ చేసినా ఆ సిరీస్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రధాన పాత్రలో మా ఇంటి బంగారంగా వస్తోంది.
రోజూ ఇంటికొచ్చి కన్విన్స్ చేసేవాడు…
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించింది. తాను మళ్లీ సినిమాల్లోకి రావడానికి కారణం ఎవరో చెప్పింది. చిలాసౌ వంటి సూపర్ హిట్ సినిమా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించి అందరికీ తెలిసిందే. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రాహుల్ రవీంద్రన్-సమంత మొదటి నుంచి మంచి స్నేహితులు. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో రోజూ ఇంటికొచ్చి గేమ్స్ ఆడుతూ అనారోగ్యం గురించి తాను మర్చిపోయేలా చేసేవాడని చెప్పింది. మళ్లీ సినిమాల్లో రావాలని కన్విన్స్ చేసేవాడని చెప్పుకొచ్చింది. తాను మళ్లీ సినిమాల్లోకి రావడానికి కారణం అతనేనని చెప్పింది.