Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాట పర్వం’. రానా హీరోగా నటించిన ఈ సినిమాను ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల తెరకెక్కించాడు. పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. జూన్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక బాక్సాఫీస్ వద్ద విరాట పర్వం ప్లాప్ టాక్ అందుకొని ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే.. థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే సినిమాను ఓటిటిలో రిలీజ్ చేశారు మేకర్స్.
ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో జూలై 1 నుండి విరాట పర్వం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో సాయి పల్లవి ఇటీవలే టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ అనిపించుకుంది. ఆ కారణంగానే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తీరా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో భాగంగా సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెగటివ్ స్ప్రెడ్ చేయడంతో బాక్సాఫీస్ వద్ద ఆడియెన్స్ నుండి సినిమాకు సరైన ఆదరణ లభించలేదు.
ఇక విరాటపర్వం ఓటిటి రిలీజ్ పై సాయిపల్లవి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 1990లలో నక్సలైట్స్ – పోలీసులు నేపథ్యంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెన్నెల పాత్రకుగాను సాయి పల్లవి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. “ఈ సినిమాలో నా కెరీర్ లోనే మర్చిపోలేని వెన్నెల పాత్రను చేశాను. ఆ పాత్రలో నటించినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం విరాట పర్వం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది” అంటూ తన పోస్ట్ లో చెబుతూ కొన్ని మేకింగ్ ఫోటోలు షేర్ చేసింది. మరి వైరల్ అవుతున్న సాయి పల్లవి పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.