సినిమా రంగంలో రూమర్స్‌కు కొదవ ఉండదు. అందులో అన్నీ నిజాలుండకపోవచ్చు. కొన్ని మాత్రం నిజాలు ఉంటాయి. ఇదిగో తోక అంటే అదిగో పులి అనే వార్తలే ఎక్కువగా విన్పిస్తుంటాయి. ఈ ఇద్దరి ప్రేమాయణం ఏ కోవకు చెందుతుందో తెలుసుకుందాం.
కోలీవుడ్ అగ్ర నటుడు ధనుష్ అంటే తెలియనివాళ్లుండరు. కేవలం తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుడా టాలీవుడ్, బాలీవుడ్‌లో కూడా మంచి పేరుంది. తెలుగులో నేరుగా సినిమాలు తీయకున్నా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక బాలీవుడ్‌లో అయితే ఈ మధ్యన నేరుగా సినిమాలు చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ఈవెంట్లలో క్రమం తప్పకుండా కన్పిస్తూ హల్‌చల్ చేస్తుంటాడు. హడావిడి లేకుండా సౌమ్యంగా కన్పించే ధనుష్‌లో ఆ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు అతడి ఫ్యాన్స్. ఎందుకంటే ఈ మధ్యన ధనుష్‌కు సంబంధించి రొమాంటిక్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
టాలీవుడ్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ వర్సెస్ ధనుష్ మధ్య ఎపైర్ నడుస్తోందనే టాక్ ఈ మధ్యకాలంలో గట్టిగా విన్పిస్తోంది. ఈ ఇద్దరూ ఎక్కడ కలిసి కన్పించినా అదే అంటున్నారు. తాజాగా సన్నాఫ్ సర్దార్ ఈవెంట్‌లో అటు ధనుష్ ఇటు మృణాల్ ఠాకూర్ ఇద్దరూ కలిసి కెమేరాకు చిక్కారు. ఈవెంట్‌లో కలిసిన ఈ ఇద్దరూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ట్రెండ్ అయ్యాయి. దక్షిణాదిలో అయితే ఈ ఇద్దరి ప్రేమాయణం సంగతి బాగా వైరల్ అయింది. మొదట్లో ఈ పుకార్లను తేలిగ్గా తీసుకున్న మృణాల్ ఠాకూర్ ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చేశారు.
ఈ ఈవెంట్‌కు ధనుష్ వస్తున్నారనే విషయం తనకు తెలియదని, అజయ్ దేవగణ్ ఆహ్వానం మేరకు వచ్చారని చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. ఈవెంట్‌లో యాధృచ్చికంగా మాట్లాడుకున్నామే తప్ప ఇద్దరి మధ్య అందరూ ఊహిస్తున్నట్టుగా ఏం లేదని తెలిపింది. ఎంత నిజం చెప్పిందో తెలియదు గానీ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం మాత్రం చేసింది. ప్రస్తుతం ధనుష్ బాలీవుడ్ యాక్షన్ రొమాంటిక్ సినిమా తేరే ఇష్క్ మేలో నటిస్తున్నారు.