బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన అభినయంతో అందరిని ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. తన గ్లామర్, నటన, స్టైలీష్ లుక్స్ లో బుల్లి తెరపై రచ్చ రచ్చ చేస్తుంది భానుశ్రీ. అనేక షోల్లో పాల్గొన్ని సందడి చేస్తూ అల్లరి పిల్లగా పేరు తెచ్చుకుంది భాను. ఇటు టీవీ ష్లోల్లో, అటు కొన్ని సినిమాల్లో నటిస్తూ లైఫ్ ను ఫుల్ బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో సైతం భానుశ్రీ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానలతో షేర్ చేసుకుంటుంది. అయితే తాజాగా భాను గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతుంది. భాను శ్రీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
భాను శ్రీ బిగ్ బాస్ లోకి వెళ్లక ముందు కొన్ని సినిమాల్లో నటించింది. బుల్లితెరపై పలు షోల ద్వారా పాపులర్ అయింది. అయితే బిగ్ బాస్ షోకి వెళ్ళొచ్చిన తరువాత భాను ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయ్యింది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగింది. అంతే కాక బిగ్ బాస్ షో అనంతరం ఆమెకు అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. పలు కామెడీ షోల్లో , ప్రత్యేక ఈవెంట్స్ లో తనదైన నటన , వాయిస్ తో సందండి చేసింది. భాను ఈ మధ్య ఎక్కువగా ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉంది. ఈవెంట్స్ లో హాట్ షో చేయడానికి కూడా వెనకాడటంలేదు ఈ అమ్మడు.
అంతే కాదు ఆమె ఒక్కో ఈవెంట్ కి రూ. 30 వేల నుంచి రూ.50 వేలు దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ అలా ఉంచితే.. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించింది ఓ వార్త వినిపిస్తోంది. ఈ అమ్మడు త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతోందని టాక్ వినిపిస్తోంది. అయితే భానును పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. వరుడి విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తోన్నాయి. భాను.. తన ఫ్రెండ్ నే ప్రేమిస్తుందని, అతడ్నే పెళ్లి చేసుకోబోతుందనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గతంలో భాను ఓ ఇంటర్యూలో చెప్పిన ఓ మాట ఆ రూమర్స్ కు బలం చేకూరుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడి పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఆ సమయంలో భాను మాట్లాడుతూ.. తాను కెరియర్ లో మంచిగా ఫొజిషన్ రావడానికి తన ఫ్రెండే కారణం అని, అతని తన జీవితంలో ఎప్పటికి లో మర్చిపోలేని చెప్పింది. దీంతో అతన్నే భాను పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే భాను శ్రీ పెళ్లి గురించి వైరల్ అవుతున్న వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.