స్టార్ హీరో పుట్టిన రోజు వస్తే చాలు.. అభిమానులు ఏదో ఒక కొత్త అప్ డేట్ ఆశిస్తారు. హీరోలు కూడా అభిమానులని దృష్టిలో ఉంచుకొని.. వారిని నిరాశపర్చకుండా ఆ రోజు ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టిన రోజున అభిమానులని ఖుషి చెయ్యడానికి రెడీ అయ్యాడని తెలుస్తుంది. శంకర్ దర్శకత్వంలో రాబోయే తన కొత్త సినిమా టైటిల్ రివీల్ చేయడం ఖాయమైపోయింది.
స్టార్ హీరో పుట్టిన రోజు వస్తే చాలు.. అభిమానులు ఏదో ఒక కొత్త అప్ డేట్ ఆశిస్తారు. హీరోలు కూడా అభిమానులని దృష్టిలో ఉంచుకొని.. వారిని నిరాశపర్చకుండా ఆ రోజు ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టిన రోజున అభిమానులని ఖుషి చెయ్యడానికి రెడీ అయ్యాడని తెలుస్తుంది. శంకర్ దర్శకత్వంలో రాబోయే తన కొత్త సినిమా టైటిల్ రివీల్ చేయడం ఖాయమైపోయింది. ఇప్పటికే ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించేశారు. అయితే.. ఇప్పుడు అదే రోజున మెగా అభిమానులు ఒక కొత్త పనికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది.
ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్. ఈ మధ్యనే గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని తెచ్చుకొని తన ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకున్నాడు. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమాలో “నాటు నాటు ” పాటకు ఆస్కార్ వరించడంతో ఇప్పుడు ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు మెగా పవర్ స్టార్. ఇదిలా ఉండాగా.. ప్రస్తుతం రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ15 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అఫిషియల్ టైటిల్ “సీఈఓ” గా ఫిక్స్ చేస్తునట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ నెల 27 న రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు సీఈఓ అనే టైటిల్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతే కాదు రామ్ చరణ్ పుట్టిన రోజున “ఆరెంజ్” సినిమా రీ రిలీజ్ చేస్తుడడంతో ఇప్పుడు మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నట్టించిన క్యూట్ లవ్ స్టోరీ “ఆరెంజ్”. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైనా.. టీవీల్లో మాత్రం సత్తా చాటింది. సమాజంలో ఉన్న వాస్తవానికి ఈ సినిమా దగ్గరగా ఉండడంతో.. ఆరెంజ్ సినిమాకి ఇప్పటికి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే మగధీర సినిమాని కాదని ఆరెంజ్ సినిమా రీ రిలీజ్(March 25, 26) చేస్తున్నారంటే జనాలను ఈ సినిమా ఎంతలా ప్రభావం చూపించిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే మెగా అభిమానులు ఈ సినిమాకి వచ్చిన డబ్బులు మొత్తం జనసేన పార్టీకి ఇవ్వబోతున్నారని సమాచారం. జనాల్లో పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు రామ్ చరణ్ ది అయినా మెగా అభిమానులు పరోక్షంగా.. పవన్ కళ్యాణ్ మీద అభిమానం చాటుకోవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.