2010 లో విడుదలైన ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాని రామ్ చరణ్ బర్త్ డే కానుకగా రీ రిలీజ్ చేశారు. కాగ అప్పుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆరెంజ్.. రీ రిలీజ్ లో మాత్రం దుమ్మురేపింది. దాంతో ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు నాగబాబు.
స్టార్ హీరో పుట్టిన రోజు వస్తే చాలు.. అభిమానులు ఏదో ఒక కొత్త అప్ డేట్ ఆశిస్తారు. హీరోలు కూడా అభిమానులని దృష్టిలో ఉంచుకొని.. వారిని నిరాశపర్చకుండా ఆ రోజు ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టిన రోజున అభిమానులని ఖుషి చెయ్యడానికి రెడీ అయ్యాడని తెలుస్తుంది. శంకర్ దర్శకత్వంలో రాబోయే తన కొత్త సినిమా టైటిల్ రివీల్ చేయడం ఖాయమైపోయింది.